రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా తక్కువ మంది స్టార్ హీరోయిన్లే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్నా. అంతలా ఈమె సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవాను చూపిస్తోంది. అంతేకాదు, అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
ఇక, ఈ మధ్య కాలంలో వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ కన్నడ పిల్ల ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

కన్నడలో ఎంట్రీ.. నిశ్చితార్థంతోనే
రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి 'ఛలో' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. దీంతో రష్మిక దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది.

అలా వచ్చి.. స్టార్‌డమ్ అందుకుని
తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోయింది. దీనికి కారణం 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడమే. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మికకు స్టార్‌డమ్‌తో పాటు క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

ఇక్కడే కాదు... ఆ భాషల్లోనూ హవా
రష్మిక మందన్నా ఈ ఏడాది చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ ఫ్లాప్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీ చేయనుంది. అలాగే, 'మిషన్ మజ్ను' మూవీతో బాలీవుడ్ ఎంటర్ అవుతోంది. అలాగే, అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ.. రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే 'యానిమల్' మూవీలోనూ భాగమైంది.

రష్మిక ఖాతాలో మరో హిట్ మూవీ
తనకు స్టార్‌డమ్‌ను అందించిన తెలుగు సినీ ఇండస్ట్రీకే రష్మిక మందన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటుంది. అందుకే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తెలుగులో సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఈ భామ 'సీతా రామం' అనే సినిమా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేశాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
భాషలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఆమె క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.

అందాలను ఆరబోస్తోన్న రష్మిక
సుదీర్ఘ కాలంగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతోంది.

రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ సెల్పీని వదిలింది. ఇందులో ఈ అమ్మడు ఓ షార్ట్‌తో పాటు స్పోర్ట్స్ బ్రాను మాత్రమే ధరించింది. దీంతో ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రష్మిక ఎద అందాతో పాటు థైస్ బాగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు విపరీతంగా రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











