ప్లాన్ మార్చిన రష్మిక మందన్న.. మహానటి, ఫిదా బ్యూటీలపై స్పెషల్ టార్గెట్!

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుండడం ఓ వర్గం ఆడియెన్స్ కి పెద్దగా నచ్చడం లేదు. ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న వైపు ఆఫర్స్ గాలి గట్టిగానే వీస్తోంది. సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె పాత్రలు ఎక్కువగా కమర్షియల్ యాంగిల్ లోనే ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.

పూజా హగ్డేకి గట్టిగానే పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తున్న రష్మిక త్వరలో కోలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. అయితే కొన్ని స్పెషల్ ఆఫర్స్ విషయంలో ఎక్కువగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ అలాగే ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఛాన్సులు డామినేట్ చేటున్నారు. ఇటీవల రష్మిక మందన్నకు వచ్చిన ఒక తమిళ్ ఆఫర్ చివరి నిమిషంలో మిస్సయ్యిందట. నిర్మాతలు ఆమెను కాదని సాయి పల్లవిని తీసుకోవడంతో కాస్త నిరాశపడిందట.

rashmika mandanna special target on star heroines

అందుకే ఇక నుంచి కొన్ని రోజులు కమర్షియల్ సినిమాలను దూరం పెట్టి యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టేలా పాత్రలను చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆఫర్స్ గట్టిగానే ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో అమ్మడు తన సరికొత్త నటనతో ఆకట్టుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆమె నటన క్లిక్కయితే అన్ని భాషల్లో ఆఫర్స్ అందుకోవచ్చు. మరి మేడం గారి కష్టం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X