twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5 నిమిషాల కోసం 4 నెలలు నరకం చూపించారు: రష్మిక మందన్న

    |

    విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

    ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక అందమైన కథను తయారు చేయడంతో పాటు... లిల్లీ లాంటి మంచి పాత్రను చేసే అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ భరత్ కమ్మగారికి థాంక్స్. కానీ ఈ సినిమా కోసం ఆయన నన్ను చాలా కష్టపెట్టారని వ్యాఖ్యానించారు.

    Rashmika Mandanna Speech at Dear Comrade Trailer Launch

    ఈ సినిమాలో 5 నిమిషాల విజువల్స్ కోసం 4 నెలలు నాతో క్రికెట్ ప్రాక్టీస్ చేయించారు. ఆ సమయంలో దెబ్బలు, నొప్పలు చాలా భరించాల్సి వచ్చింది. షూటింగ్ చాలా ఫన్నీగా సాగింది. కానీ షూటింగులో 20 రోజులు నన్ను ఏడిపించారు. 4 నెలల పాటు డబ్బింగ్ చెప్పించారు. ఒక సినిమా కోసం నాలుగు నెలలు ఎవరైనా డబ్బింగ్ చెబుతారా? మొన్న కూడా ఓ డైలాగ్ బాగోలేదని మళ్లీ చెప్పించారని రష్మిక గుర్తు చేసుకున్నారు.

    ఇలాంటి సినిమా చేసినందుకు ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. షూటింగ్ అయిపోవడంతో కాస్త బ్యాడ్ ఫీలవుతున్నాను. అందరూ దూరం అయినట్లు అనిపిస్తోంది. ఇపుడు ట్రైలర్ చూసి ఆ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాను. అందరూ నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఇపుడు నేను మమ్మీ ఫిగర్‌లాగ... అందరికీ మెసేజ్ చేసి తిన్నారా? పడుకున్నారా? మీ ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారా? అని అడిగే స్టేకి వచ్చాను అని రష్మిక తెలిపారు.

    English summary
    Rashmika Mandanna Speech at Dear Comrade Trailer Launch. Makers have decided to release the film on the 26th of July. Rashmika plays the female lead in this film which is an out and out love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X