Rashmik: ది గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక‌వుతారు!

టాలీవుడ్ సెన్సేషన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన "థామా (Thammaa)" సినిమా విజయంతో ఆమె కెరీర్ మళ్లీ జోష్‌లోకి వచ్చింది. ఇప్పుడు రష్మిక మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ "ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుండగా, ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనే విషయం వైరల్ గా మారింది. ఇంతకీ ఎంత పారితోషకం తీసుకున్నారంటే?

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన రష్మిక, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని అందరి మనసు దోచుకున్నారు. ప్రేమ, భావోద్వేగం, సస్పెన్స్‌లతో మేళవించిన ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు "ఇది రష్మిక కెరీర్‌లో మరో మైలురాయి కానుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni)నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Rashmika Mandanna Stars in The Girl Friend Without Taking Any Remuneration

ట్రైలర్ లాంచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. రష్మిక మందన్నా రెమ్యూనరేషన్ గురించి ధీరజ్ మొగిలినేని షాకింగ్ వెల్లడించారు. "ఈ సినిమాకి రష్మిక గారు ఒప్పుకోకపోతే.. మేము మరెవరితోనూ ఈ సినిమా చేయలేము. కథ విన్న వెంటనే ఆమె 'నేను ఈ సినిమా చేయాలనుకుంటున్నా'అని అంగీకరించారు. రెండు రోజుల తర్వాత ఆమె మేనేజర్‌తో రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటానికి ప్రయత్నించాం. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నేరుగా రష్మిక గారినే అడిగాం. అప్పుడు ఆమె చెప్పిన మాట మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది" అని చెప్పారు.

నిర్మాత చెప్పిన ప్రకారం, రష్మిక ఈ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఆమె మాట్లాడుతూ "ఇది నాకు చాలా స్పెషల్ కథ. ముందుగా ఈ సినిమాను మంచి అవుట్‌పుట్‌తో పూర్తి చేద్దాం. సినిమా విడుదలైన తర్వాతే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుందాం," అని చెప్పిందట. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి స్థాయిలో ఉన్న స్టార్ హీరోయిన్‌ రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రష్మిక అభిమానులు ఆమెను ఆకాశానికెత్తేశారు. "ఇలాంటి అంకితభావం ఉన్న నటులు ఇండస్ట్రీకి అరుదు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నారు. విజయ్ దేవరకొండతో రష్మిక నిశ్చితార్థం వార్తలతో పాటు, వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఈ క్రేజీ కపుల్ వివాహానికి ఎదురుచూస్తున్నాయి. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో కలిసిన నటించిన ఈ జంట ఇప్పుడు మరో సినిమాలో కాంబినేషన్‌లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X