Rashmika Mandanna: మీరు ఎంత చెబితే అంతే రెమ్యునరేషన్ అడుగుతా.. నాలుగా, నాలుగున్నర కోట్లా?

ఛలో సినిమాతో తెలుగు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈ క్యూట్ బ్యూటీ యానిమల్ సినిమాతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. అయితే యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీటిపై రష్మిక స్పందించింది. మీడియాపై చాలా గట్టిగా ఫైర్ అయింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గీతా గోవిందం సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ కూర్గ్ భామ.. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. రణ్ బీర్ కపూర్ సరసన నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అమ్మాయిగా, లవర్ గా, భార్యగా, ఓ ఇంటి కోడలిగా అద్భుతంగా నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా స్టార్ హీరోలను కూడా చూడనీయకుండా తన నటనతో కట్టిపడేసింది. అయితే ఈ సినిమా తర్వాత నుంచి ఆమెకు అవకాశాలు మరింత ఎక్కువయ్యాయి.

Rashmika Mandanna Strong Reply To Media Houses For Rumours on Her Remuneration Hike Check Details

ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత నుంచి రష్మిక మందన్నా పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 4 నుంచి 4.5 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుందని టాక్ నడుస్తోంది. చాలా వెబ్ సైట్లతో పాటు అనేక పేపర్లు, టీవీల్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఫిల్మీ బౌల్ అనే ఓ ట్విట్టర్ అకౌంట్ లో యానిమల్ సినిమా తర్వాత నుంచి రష్మిక 4 నుంచి 4.5 కోట్ల రూపాయల రెమ్యునరేష్ అడుగుతుందంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక గట్టిగా రిప్లై ఇచ్చింది.

ముఖ్యంగా వారు చేసిన ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు.. నాకే ఆశ్యర్యంగా ఉందంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ వార్తలు అన్నీ చూసిన తర్వాత నేను నిజంగానే నా రెమ్యునరేషన్ గురించి ఓసారి ఆలోచించాలనుకంటున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తన నిర్మాతలు ఎందుకు ఇంత రెమ్యునరేష్ పెంచావని అడిగితే.. మీడియా అలాగే చెబుతుంది సార్.. నేను వారి మాటలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను... నేనేం చేయాలని అడుగుతానంటూ స్పష్టం చేసింది.

రష్మిక ఇచ్చిన ఈ రిప్లై చూస్తేనే ఆమె తన పారితోషికాన్ని పెంచలేదని అర్థం అవుతుంది. అలాగే ఇవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. మరోసారి తన రెమ్యునరేష్ గురించి తప్పుడు వార్తలు రాయకుండా రష్మిక గట్టిగా స్పందించిన విధానాన్ని నెటిజెన్లు సపోర్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X