హాట్ షోలో రెచ్చిపోతున్న రష్మిక మందన్నా.. పై నుంచి కింది వరకు మొత్తం చూపిస్తూ!
గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న రష్మిక మందన్న ప్రతి సినిమాతో కూడా తన రేంజ్ ను కూడా పెంచుకుంటుంది. ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక రష్మిక మందన్న గ్లామర్ డోస్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె ఒక అవార్డ్స్ ఈవెంట్స్ లో కనిపించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఆమె హాట్ హాట్ గా స్టైలిష్ డ్రెస్ లో కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..

చిన్న సినిమాలతో బిగ్ హిట్స్
కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న మొదట తెలుగులో అయితే ఛలో అనే చిన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంట వెంటనే మీడియం రేంజ్ హీరోలతో చేసిన సినిమాలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గీతాగోవిందం భీష్మ సినిమాలు కూడా ఆమె రేంజ్ ను మరింతగా పెంచాయి.

అగ్ర హీరోలతో..
ఇక రష్మిక స్టార్ హీరోలతో కూడా అవకాశాలు చాలా తొందరగానే అందుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో అవకాశాలు ఎక్కువ స్థాయిలో అందుకుంటుంది. ఇక పుష్ప సినిమా కూడా సక్సెస్ కావడంతో రష్మిక మందన్న మళ్లీ చిన్న హీరోలతో చేయదేమో అని అనుకున్నారు. కానీ ఆమె మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అంటుంది.

స్పెషల్ పాత్రలో..
శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా రష్మిక నటించింది. అయితే ఆ సినిమా కంటెంట్ అంతగా క్లిక్ ఇవ్వలేదు. ఇక సితారామం సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా ఆమె కెరీర్ కు కలిసి వచ్చింది. బాలీవుడ్ లో గుడ్ బాయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

మరోసారి హిందీలో
ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విజయ్ వారసుడు సినిమాతో మళ్ళీ రష్మిక మందన్న ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్లో మిషన్ మజ్ను అనే సినిమా ద్వారా కూడా మరోసారి ఆమె హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

రష్మిక హాట్ గ్లామర్
అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా రష్మిక తన గ్లామర్ తో మాత్రం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. రీసెంట్ గా జీ సినిమా అవార్డ్స్ లో కనిపించిన విధానం అందరికీ షాక్ ఇచ్చింది. ఈవెంట్ కు చాలా మంది బ్యూటీలు వచ్చినప్పటికీ అందులో మేజర్ గా రష్మిక చాలా హైలెట్ గా నిలిచింది. ఆమె వేసుకున్న డ్రెస్ చూసి అందరూ కూడా ఆమె వైపు ఎక్కువగా ఫోకస్ చేశారు.

మైండ్ బ్లాక్ అయ్యేలా..
ఇక రష్మిక మందన టాప్ టు బాటమ్ గ్లామర్ తో అదరగొట్టేసింది. టాప్ లో క్లివేజ్ అందాలు వైరల్ అయ్యాయి. ఇక లెగ్స్ అందాలతో కూడా ఆమె మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి. ఇక అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











