ప్రేమ అంటే ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడమా? రష్మిక షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన (Rashmika Mandanna)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంది. ముఖ్యంగా పుష్ప, యానిమల్ సినిమాలు చేసిన తర్వాత రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా మార్చుకుంది. తాజాగా రష్మిక లేటెస్ట్ గా ఓ ఇంటర్య్వూలో తన వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. ఈ సమయంలో ప్రేమ, బ్రేకప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

రష్మిక నటించిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'థామ'(Thama). 'ది వరల్డ్ ఆఫ్ థామ' అనేది ట్యాగ్ లైన్. హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. తెలుగులో కూడా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. ఇక 'ది గర్ల్‌ఫ్రెండ్' (The Girlfriend) ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి కనిపించనున్నారు.

Rashmika Mandanna Talks About Love and Control Engagement Rumors with Vijay Go Viral

ఒక టాక్ షోలో యాంకర్ రష్మికను ఆశ్చర్యపరిచే ప్రశ్న అడిగారు "ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడం ప్రేమేనా?" అన్ని ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు ముందుగా స్పందించిన డైరెక్టర్ రాహుల్ "ఇది మోస్ట్ అన్‌హెల్తీ థింగ్. బంధంలో ఒకరిని ఒకరు కంట్రోల్ చేయడం సరి కాదు. చివరికి, ఆ బంధం పూర్తిగా తేలిపోతుంది" అని వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే స్పందించిన రష్మిక మందాన సూటిగా సమాధానమిచ్చింది. ఇది సాడ్ రియాలిటీ. నిజానికి, చాలామందిని ఒకరిని ఒకరు కంట్రోల్ చేసే అలవాటు ఉంది. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి 'ప్రాపర్టీ'గా చూస్తారు. ఇది సమాజంలో చాలా కామన్ అయిపోయింది. ప్రేమ అనేది గౌరవం, స్వేచ్ఛతో ఉండాలి. కంట్రోల్ చేయడం హెల్తీ కాదు." అని పేర్కొన్నారు.

తరువాత డైరెక్టర్ రాహుల్ కూడా స్పందిస్తూ, "మన చుట్టూ ఉన్న సమాజంలో ఇది చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు, ఓ అమ్మాయి మోడ్రన్ డ్రస్ వేసుకొని నలుగురిలో కనిపిస్తే వెంటనే వాళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి 'నీ గర్ల్‌ఫ్రెండ్‌ను కంట్రోల్ చేయలేవా?' అని అడిగే పరిస్థితి ఇప్పటివరకు సాధారణంగా మారిపోయింది" అని చెప్పాడు. ఇలా రాహుల్, రష్మిక ల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. రష్మిక మంధాన - విజయ్ దేవరకొండ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేతికి ఓ రింగ్ కనిపించడంతో ఆ నిశ్చితార్థ వార్తలకు ఊతమిచ్చినట్టు అయింది. అలాగే.. రష్మిక చేతికి కూడా ఓ ఉంగరం కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ జంట ఎక్కడా తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియా వార్తల ప్రకారం.. రష్మిక- విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోవడం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X