మాజీ లవర్‌తో రష్మిక రొమాన్స్: ట్విట్టర్ వేదికగా ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఇలా.!

By Manoj Kumar P

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్నా. నాగశౌర్య నటించిన 'ఛలో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. అందంతో పాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తాజాగా ఆమె తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో మరోసారి కలవబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

 సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటోంది

సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటోంది

‘ఛలో' సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత ‘గీత గోవిందం' వంటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీటితో పాటు ఈ మధ్య వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' కూడా హిట్ అవడంతో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. ‘డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను నిరాశ పరిచింది.

అల్లు అర్జున్‌తో రొమాన్స్‌కు సై అంది

అల్లు అర్జున్‌తో రొమాన్స్‌కు సై అంది

రష్మిక మందన్నా ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనుంది. ఇందులో ఆమె ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీలో బన్నీతో ఆమె రొమాన్స్ హైలైట్ అని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ ఆమె

జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ ఆమె

ప్రస్తుతం RRR షూటింగ్‌లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ ఏడాది సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రష్మికనే తన ఫస్ట్ చాయిస్‌ అని దర్శకుడితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

మాజీ లవర్‌తో రష్మిక మందన్నా రొమాన్స్

ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్నా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో ఆమె మరోసారి జతకట్టబోతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. నిశ్చితార్థం కూడా అయిన తర్వాత వీళ్లిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ ద్వారా ప్రకటన.. అనుమానాలు మొదలు

ట్విట్టర్ ద్వారా ప్రకటన.. అనుమానాలు మొదలు

తాజాగా రక్షిత్ శెట్టి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘కిర్రాక్ పార్టీ 2 గురించి ఇప్పటి వరకు ఏ ప్లాన్ లేదు. కానీ, ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. మా సినిమా మరోసారి మీకోసం రాబోతుంది' అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా మొదటి భాగంలో రష్మిక హీరోయిన్ కావడంతో.. రెండో భాగంలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X