Rashmika: నా హృదయంలో మీకు ప్రత్యేక స్థానం.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ ..
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందాన.. వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కుర్రళ్ల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన పుష్ప 2 ఎలాంటి సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సక్సెస్ తో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కన్నడ ముద్దగుమ్మ అందం, అభినయంతో
తెలుగు సినిమాలతో వరుస విషయాలు అందుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ' పుష్ప 1', పుష్ప 2 సినిమాలతో నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీ వల్లి అనే పాత్రలో నటించి, మెప్పింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

ఇదిలా ఉంటే.. 'పుష్ప 2'సినిమా ఎలాంటి విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1850 కోట్లకుపైగా భారీ మొత్తంలో కలెక్షన్స్ వసూలు చేసింది. ఇలా అపార విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నిన్న శనివారం హైదరాబాద్‌లో 'థ్యాంక్స్ మీట్' ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఈవెంట్ కు రష్మిక మందన్న అందులో పాల్గొనలేకపోయింది.
ఈ క్రమంలో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో నేషనల్ క్రష్ ..'నిన్న జరిగిన 'పుష్ప 2 థాంక్యూ మీట్'లో నేను పాల్గొనలేకపోయాను. కానీ,నేడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత అద్బుతమైన సినిమా నటించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

అలాగే,'శ్రీవల్లిగా చెప్పాలంటే.. మీకు ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా కోసం మా సర్వస్వం ధారబోశాం. సినిమాను అద్భుతంగా తీయడానికి కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. అలాగే మూవీ టీం అందరికీ ధన్యవాదాలు. ' ఎమోషనల్ పోస్ట్ చేసింది.
రష్మిక మందన్న వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించగా.. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించారు. ఇందులో రష్మిక శంభాజీ భార్య ఏసుబాయిగా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషనల్స్ లో బిజీగా ఉంది రష్మిక. ఇదిలా ఉంటే.. 'సికందర్', 'థామ', 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్ బో' వంటి సినిమాలను వరుసగా లైన్ లో పెట్టింది నేషనల్ క్రష్ రష్మిక .


Click it and Unblock the Notifications











