స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న.. టాలీవుడ్ డైరెక్టర్‌తో నేషనల్ క్రష్
పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారిన అందాల భామ రష్మిక మందన్న మరో భారీ ఆఫర్‌ను దక్కించుకొన్నది. బాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ మరోసారి ప్యాన్ సౌత్ ఇండియా మూవీలో స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఈ సినిమా ఆఫర్ గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి తన సంతోషాన్ని పంచుకొన్నది. ఆ స్టార్ హీరో ఎవరు? ఆ సినిమా దర్శకుడు ఎవరు? అనే విషయాల్లోకి వెళితే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏషియన్ గ్రూప్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం D51. సౌత్ ఇండియా స్టార్ హీరో ధనుష్ హీరోగా తన కెరీర్‌లో 51వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తుండగా, సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.

ఫీల్‌గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌తో కలిసి రష్మిక మందన్న నటించనున్నారు. ఈ విషయాన్ని రష్మిక మందన్న స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిర్మాత, దర్శకులు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.
D51 చిత్రంలో ప్రముఖ, పాపులారిటీ ఉన్న అగ్ర నటులను నటింపజేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటుల పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే చిత్ర యూనిట్ తమ చిత్రంలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











