రష్మిక డబుల్ ధమాకా.. బాలీవుడ్‌లో కన్నడ భామకు ఆఫర్ల వెల్లువ.. పాపులర్ బ్యానర్‌లో మూవీ
సరిలేరు నీకెవ్వరుు, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న రష్మిక మందన్న చూపంతా ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ఇప్పటికే ఓ క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకొన్న రష్మికకు బాలీవుడ్‌లో మరో భారీ ఆఫర్ లభించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

మిషన్ మజ్నుతో బాలీవుడ్ ఎంట్రీ
కొద్ది రోజుల క్రిత్రమే మిషన్ మజ్ను అనే బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిషన్ మజ్ను షూట్ కోసం ఇటీవలే రష్మిక ముంబైలో అడుగు పెట్టి అందర్ని ఆకర్షించారు.

ప్రఖ్యాత బ్యానర్‌లో మరో హిందీ మూవీ
ఇదిలా ఉండగా, రష్మిక మరో బాలీవుడ్ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. హిందీ చిత్రసీమలో ప్రఖ్యాత బ్యానర్ రూపొందించే సినిమా చేసేందుకు సంతకం చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనున్నది అంటూ బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి.

త్వరలోనే అధికారికంగా
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం... రష్మిక మందన్న ఇప్పటికే రెండు చిత్రాలు అంగీకరించారు. అందులో ఒక చిత్రం అధికారికంగా ప్రకటించారు. మరో చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. అంతేకాకుండా రష్మిక పలు రకాల స్క్రిప్టులను అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే పలు ఆఫర్లను ఆమె దక్కించుకొనే అవకాశం ఉంది అని కథనాల్లో పేర్కొన్నారు.

రష్మిక మందన్న కెరీర్ ఇలా
ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే... లాక్‌డౌన్‌కు ముందు రిలీజైన భీష్మ చిత్రంతో హిట్‌ను ఖాతాలో వేసుకొన్న కన్నడ భామ పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన పొగరు కన్నడ చిత్రం తెలుగులో డబ్ అయి రిలీజ్‌కు సిద్దమైంది. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆడాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











