మనసులో మాట బయటపెట్టిన రష్మిక.. ఊరించి బ్రహ్మచార భీష్ములకు షాక్
Recommended Video

కన్నడ భామ రష్మిక వరుస సినిమాలతో దూసుకెళ్తున్నది. గీత గోవిందం, దేవదాస్ చిత్రాలతో ఘనమైన సక్సెస్‌లను సొంతం చేసుకొన్న ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి తాను ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. సాయంత్రం 6 గంటలకు నా మనసులో మాట చెబుతాను అని ఊరించింది రష్మిక. చివరకు తాను ఏమని ట్వీట్ చేసిందంటే..
నితిన్‌తో భీష్మ చిత్రంలో
లేడీస్ అండ్ జెంటిల్మన్.. బాయ్స్ అండ్ గర్ల్స్.. జీవితాంతం బ్రహ్మాచారులుగా భీష్మ బాయ్స్‌కి శుభవార్త. హీరో నితిన్ సర్.. దర్శకుడు వెంకీ కుడుముల సార్.. నిర్మాత నాగవంశీ సార్.. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో భీష్మ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా ఎప్పుడెప్పుడూ మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నాను అని రష్మిక ట్వీట్ చేసింది.
హ్యాపీ బర్త్ డే నితిన్
మార్చి 30న జన్మదినం జరుపుకొంటున్న నితిన్‌కు హ్యాపీ హ్యపీ బర్త్ డే అంటూ విషెస్ తెలియజేసింది. ఈ ఏడాది మీకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకొన్నది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చే సినిమాతో మనకు మరింత ఆనందం కలుగాలని కోరుకొంటున్నాను. స్క్రీన్ పైనే కాదు.. షూటింగ్‌లో ఫన్ ఉంటుందని భావిస్తున్నాను అని మరో ట్వీట్‌లో రష్మిక వెల్లడించింది.

వివాదంగా విజయ్ దేవరకొండతో ముద్దు
విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రష్మిక క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొంటున్నది. మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల రిలీజైన టీజర్ వివాదంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

బిజీగా తెలుగు, తమిళంలో రష్మిక మందన్న
డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత తెలుగులో భీష్మ సినిమాకు ఒకే చెప్పింది. తమిళంలో కార్తీ తన కెరీర్‌లో 19వ చిత్రంగా చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే విఘ్నేష్ శివన్‌తో శివకార్తీకేయన్ చిత్రంలో కూడా నటించడానికి అంగీకారం తెలిపింది.


Click it and Unblock the Notifications











