For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మికతో కుర్రాడి అసభ్య ప్రవర్తన: అలాంటి ఫొటో షేర్ చేసి దారుణంగా.. అతడికి హీరోయిన్ ఊహించని రిప్లై

  |

  రష్మిక మందన్నా.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తుందామె. అదే సమయంలో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంతో తాజాగా రష్మిక మందన్నాకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా.. తను మాత్రం ఊహించని రిప్లై ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా పరిచయం.. టాలీవుడ్ ప్రవేశం

  అలా పరిచయం.. టాలీవుడ్ ప్రవేశం

  రష్మిక మందన్నా ‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించిందామె. దీంతో అదే భాషలో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ‘అంజనీ పుత్ర', ‘చమ్మక్' వంటి చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘ఛలో' అనే మూవీతో టాలీవుడ్‌లోకీ వచ్చింది.

  టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  లక్కీ హీరోయిన్‌గా... వరుస ఆఫర్లతో

  లక్కీ హీరోయిన్‌గా... వరుస ఆఫర్లతో

  మిగిలిన భాషలతో పోలిస్తే రష్మిక మందన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు భారీ విజయాలను అందుకుంది. ‘ఛలో' నుంచి వరుసగా ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో లక్కీ హీరోయిన్ అని పేరు దక్కించుకుని దూసుకెళ్తోంది. తద్వారా మరిన్ని ఆఫర్లను అందుకుంటోంది.

  నేషనల్ క్రష్ అయిపోయిన బ్యూటీ

  నేషనల్ క్రష్ అయిపోయిన బ్యూటీ

  రష్మిక మందన్నా చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం 2020 సంవత్సరానికి గానూ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపిక కావడమే. గతంలో ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె హైలైట్ అయింది.

  రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!

   దేశ వ్యాప్తంగా క్రేజ్.. రష్మిక ఫుల్ బిజీ

  దేశ వ్యాప్తంగా క్రేజ్.. రష్మిక ఫుల్ బిజీ

  రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు ‘మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

  అందులో ఎప్పుడూ సందడి చేస్తూనే

  అందులో ఎప్పుడూ సందడి చేస్తూనే

  వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. దీంతో హైలైట్ అవుతూ ఉంటోంది.

  Bigg Boss: ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రవి.. మా ఆయన చూస్తాడు అంటూనే తను కూడా!

  దీన్ని ఎలా తీసుకుంటున్నారు అని

  దీన్ని ఎలా తీసుకుంటున్నారు అని

  దసరా పండుగను పురస్కరించుకుని ‘ఆడవాళ్లు మీకు జోహర్లు' సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శర్వానంద్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఉంది. ఇక, ఈ పోస్టర్‌ కింద ఓ నెటిజన్ రష్మిక మందన్నా పాత ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఎలా తీసుకుంటున్నార్రా దీన్ని' అంటూ అసభ్యంగా కామెంట్ పెట్టాడు.

  Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
  ఊహించని రిప్లై ఇచ్చిన హీరోయిన్

  ఊహించని రిప్లై ఇచ్చిన హీరోయిన్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్నా.. తనను అసభ్యంగా దూషిస్తూ సదరు నెటిజన్‌ చేసిన కామెంట్‌పై స్పందించింది. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్‌కు ‘నా యాక్టింగ్ కోసమే వాళ్లు నన్ను తీసుకుంటున్నారు' అని ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ తన ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. రష్మిక రిప్లైకు ఫ్యాన్స్ మద్దతిస్తున్నారు.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very active in Social Media. Now She Gave Unexpected Reply to Netizen
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X