Pushpa: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలస్యంగా బయటపడిన ఘటన.. అభిమానులకు గాయాలు.. బాధపడిన రష్మీక!
ఈ ఏడాది రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప ఎలాంటి విజయం అందుకుంటుంది అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే అఖండ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక అదే తరహాలో రానున్న పుష్ప ద రైజ్ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక పుష్ప గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చూసిన తరువాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లక్షలాది మంది అభిమానులు ఈవెంట్ లో సందడి చేశారు. అయితే ఈవెంట్ లో జరిగిన ఒక ఘటన పై రష్మీక మందన్న సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు.

భారీ స్థాయిలో అభిమానులు
అధివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అల్లు అర్జున్ అభిమానులు వచ్చారు. అయితే వేడుకలో అభిమానుల సందడి ఎక్కువ కావడంతో కొందరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. నిర్వాహకులు కూడా కొందరిని అదుపు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు.

గాయపడిన ఫ్యాన్స్
అయితే కొందరు అత్యుత్సాహం వలన కొందరు అభిమానులు వేడుకలో గాయపడ్డారు. ఇక ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యులు వరకు వెళ్ళడంతో వెంటనే వారి యోగ క్షేమల గురించి తెలుసుకున్నారు. ఇక ఈ విషయంలో హీరోయిన్ రష్మీక మందన్న కూడా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని ఆమె కోరుకున్నారు.

బాధగా అనిపించింది
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ
ధన్యవాదాలు అంటూ.. అయితే వేడుకలో కొందరు గాయపడ్డారని తెలిసిందని.. ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధగా అనిపించినట్లు.. రష్మీక పేర్కొంది. ఇక మీరందరూ బాగున్నారనీ.. ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటున్నారని నేను నిజంగా ఆశిస్తున్నాను.. అని తెలియజేశారు.

మిగతా భాషల్లో ఎలా ఉంటుందో..
ఇక తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటేనే ఓపెనింగ్స్ భారీస్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ మిగతా భాషలో ఎలా ఉంటుంది అనే పరిస్థితి పై విడుదలయ్యే వరకు కూడా ఎలాంటి క్లారిటీ రాదనే చెప్పాలి. పుష్ప సినిమాను మొదట దర్శకుడు రెండు భాగాలు కాకుండా ఒకే భాగంలో పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ నిడివి ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచించారు.
Recommended Video

బడ్జెట్ ఎంతంటే..
ఇక రెండవ భాగం షూటింగ్ కూడా కొంత బ్యాలెన్స్ ఉంది అయితే షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి భాగం కోసం నిర్మాతలు 190కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ పార్ట్ కోసం మాత్రం ప్రస్తుతం అనుకున్నంతగా అయితే ఖర్చు చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పుష్ప పార్ట్ 1 రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











