Rashmika Mandanna: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్..
Rashmika Mandanna: రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కుర్రాళ్ల గుండెల్లో కలల రాణిగా ముద్ర వేసుకుంది. వరుస విషయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా తన ప్రియుడు విజయ్ దేవరకొండ నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో రష్మిక మందన్న ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ అసలేం జరిగింది. నేషనల్ పెట్టిన పోస్ట్ ఏంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.
రష్మిక మందాన.. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా తన హావా కొనసాగిస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రతో మెప్పించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా కావడంతో రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా మారింది. ఈ ఫేమ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అలా.. సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'లో అదరగొట్టింది. తన గ్లామరస్ యాక్టింగ్ తో బాలీవుడ్ షేక్ అయింది. ఇటీవల 'పుష్ప 2' సినిమాతో మరోసారి సెన్సెషన్ గా మారిపోయింది. ఈ సినిమాతో రష్మిక వర్డల్ వైడ్ ఫ్యాన్స్ సొంతం చేసుకుంది.

తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)'చావా'(Chaava) సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. ఈ మూవీని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
చావా మూవీ ప్రమోషనల్స్ లో రష్మిక బిజీగా ఉంది. ఇదిలాఉంటే.. 'సికందర్', 'థామ', 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్ బో' వంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నేషనల్ క్రష్ రష్మిక. రష్మిక మందన్నా కేవలం సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో "దయ చూపించండి'' అంటూ ఓ మెసేజ్ షేర్ చేయగా.. ఆ పోస్టు వైరల్ గా మారింది. "ఈరోజుల్లో దయ తగ్గిపోతోంది. అందరూ ఒకరిపై ఒకరు దయతో వ్యవహరించాలి" అని చెప్పిన రష్మిక తన ధరించిన టీషర్ట్‌పై కూడా 'Kindful' అనే పదం ఉంది.

దీంతో రష్మిక పోస్ట్ వెనుకున్న అర్థం గురించి అభిమానులు, నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అసలేం జరిగిందంటే.. రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. జిమ్ నుండి బయటకు వచ్చే సమయంలో రష్మిక కాలికి గాయం కారణంగా.. ఇబ్బంది పడుతూ కారు ఎక్కింది. పక్కనే ఉన్నా విజయ్ మాత్రం సహాయం చేయకుండా సైలెంట్ వెళ్లి కారు లోపల కూర్చోన్నారు. ఈ ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో విజయ్ కు సపోర్ట్ గా నిలుస్తూ ఇలా కామెంట్స్ చేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











