భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌కు రష్మిక వార్నింగ్ .. అసలేం జరిగింది?
సినిమాలు, షూటింగ్స్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఎంత హడావుడిలో ఉన్నా, అస్సలు ఖాళీ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కనీసం రోజుకొక పోస్ట్ అయినా పెట్టాల్సిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఏకంగా భారత స్టార్ షట్లర్‌కే ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీని వెనుక ఏం జరిగిందన్న నేపథ్యంలోకి వెళితే..
కిరాక్ పార్టీతో చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ , పుష్ప సినిమాలు రష్మికకు తెలుగునాట స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్‌లోనూ చాన్సులు దక్కించుకున్నారు. ఈ పాపులారిటీతో బాలీవుడ్‌లోనూ ఆమె అవకాశాలు క్యూకట్టాయి. గతేడాది సందీప్ రెడ్డి వంగా - రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్'లో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ - తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సికందర్'లో ఆమె హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీనితో పాటు రైన్ బో, గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో రిలీజ్ కానున్న సుకుమార్ - అల్లు అర్జున్ ల పుష్ప-2 ద్వారా ఆమె మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు తన కొత్త సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటారు.

మొన్నామధ్య మనిషి జీవితానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటో లైఫ్ లెసన్స్‌ను కూడా తెలియజేశారు. వేళకు మంచి భోజనం తీసుకోవడం, నవ్వుతూ నవ్విస్తూ ఉండటం, మంచి నిద్ర, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్, తన పెట్ డాగ్‌తో ఆడుకోవడం , సీట్లు తినడం, కాఫీ తాగడం, కష్టపడి పనిచేయడం వంటివి తనకు ఎంతో రిలీఫ్ ఇస్తాయని రష్మిక చెప్పారు. ఇవి లేకుండా తన జీవితం ఊహించుకోలేనని ఆమె చెప్పిన మాటలు ఎంతో మందిని ఆలోచింపజేస్తున్నాయి.
తాజాగా రష్మిక మందన్న పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఏకంగా భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు ఆమె వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే టాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను కిదాంబి శ్రీకాంత్ పెళ్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు రష్మిక హాజరై విషెస్ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశారు.

అక్కడితో ఆగకుండా శ్రీకాంత్.. ఇకపై శ్రావ్య మేడమ్ నీది.. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా పోస్ట్ పెట్టారు. దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శ్రావ్య వర్మ స్వయానా మేనకోడలు. నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధ్రువ్ వంటి స్టార్స్‌కు శ్రావ్య స్టైలిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి పనిచేస్తున్నారు. ఆగస్ట్ 10న కిదాంబి శ్రీకాంత్ - శ్రావ్యల ఎంగేజ్‌మెంట్ జరగనుంది.


Click it and Unblock the Notifications











