కాక్ టెయిల్ 2 లో నటించడానికి భయపడ్డా.. రొమాంటిక్ పాత్రపై రష్మిక కామెంట్స్!

రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటు బాలీవుడ్ లోనూ అటు టాలీవుడ్ లోను వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి రష్మిక. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమవుతోంది. 'యానిమల్', 'ఛావా' వంటి పాన్ఇండియా సినిమాల తర్వాత తర్వాత ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాక్‌టెయిల్ 2 (Cocktail 2). జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాలో రష్మిక 'దియా' అనే పాత్రలో కనిపించనుంది. అయితే ఈ పాత్ర ఒప్పుకోవడానికి రష్మిక భయపడిందట కానీ ఓ కారణంతో పాత్రలో నటించడానికి ఒప్పుకుందట.

కాక్ టైల్ 2 మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన రష్మిక, ఈ పాత్రను అంగీకరించే సమయంలో తాను చాలా భయపడ్డానని వెల్లడించింది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలతో పోలిస్తే 'దియా' పూర్తిగా భిన్నమైనదని ఆమె చెప్పింది.

Rashmika Mandanna Was Scared to Accept Her Romantic Role in Cocktail 2 Here s Why

"నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను ఇంత అర్బన్‌గా కనిపించిన సినిమా ఇదే. ప్రేక్షకులు నన్ను ఎక్కువగా సీరియస్‌, ఎమోషనల్‌, డ్రామాటిక్ పాత్రల్లో చూసేందుకు అలవాటు పడ్డారు. అలాంటి సమయంలో స్నేహం, ప్రేమ, సరదా, యువతలోని పిచ్చి చేష్టల చుట్టూ తిరిగే ఈ పాత్ర చేయడం సరైన నిర్ణయమేనా అనే సందేహం మొదట నాలో కలిగింది. ఈ పాత్రను ఒప్పుకునే ముందు చాలా భయపడ్డాను" అని రష్మిక పేర్కొంది.

అయితే అదే భయం చివరకు ఈ పాత్రను అంగీకరించేలా చేసిందని ఆమె తెలిపింది. "ఇలాంటి పాత్ర నేను ఇంతవరకు చేయలేదు. ప్రేక్షకులకు కూడా నాలో కొత్త కోణం చూపించాలని అనిపించింది. అందుకే ఈ సినిమా నాకు సరైన అవకాశం అనిపించింది" అని వివరించింది. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఆమె తన ఇమేజ్‌ను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేయకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ట్రైలర్‌లో దియా పాత్ర ఎంతో ఉత్సాహంగా, అమాయకంగా, జీవితాన్ని ఆస్వాదించే యువతిగా కనిపించింది. స్నేహం, ప్రేమ, సరదా క్షణాలతో నిండిన ఈ పాత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రష్మిక స్టైలింగ్, అర్బన్ లుక్, బాడీ లాంగ్వేజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇప్పటివరకు 'పుష్ప', 'సీతారామం', 'యానిమల్' వంటి చిత్రాల్లో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు 'కాక్‌టెయిల్ 2' కొత్త పరీక్షగా మారనుంది. ఈ సినిమా విజయవంతమైతే ఆమెకు రొమాంటిక్-అర్బన్ ఎంటర్‌టైనర్‌లలో కూడా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 'కాక్‌టెయిల్ 2'లో రష్మిక కొత్త అవతారం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో జూన్ 19న తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X