Rashmika Mandanna: మెడలో మంగళ సూత్రంతో ఈవెంట్‌కి.. విజయ్‌కి భార్యగా ట్రెడిషనల్ లుక్‌లో రష్మిక!
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ దంపతులుగా మారిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సాగిన ప్రేమబంధానికి ముగింపు పలికి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రష్మిక ఇప్పుడు తెలుగింటి కోడలు కాగా.. విజయ్ కర్ణాటకకు అల్లుడు అయ్యారు. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా, స్టైల్‌కు, ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచిన రష్మిక ఇప్పుడు ఇల్లాలిగా నిజ జీవిత పాత్రను ఎలా పోషిస్తారోనని ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. వీటన్నింటినీ ఒకే ఒక్క ఫోటోతో పటాపంచలు చేసింది రష్మిక మందన్న. ఈ వివరాల్లోకి వెళితే..
ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు పెళ్లి చేసుకున్న నాటి నుంచి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌కు చేరుకుని తమ కుటుంబ సభ్యులు, సన్నహితులతో సంతోషంగా గడుపుతున్నారు. వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా భారీ ప్లానింగ్‌తో నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్లిలో సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విరోష్ జంట. విభిన్నమైన ఏర్పాట్లతో అందరి మన్ననలు పొందుతున్నారు.

వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రజలకు స్వీట్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బహుశా ఇలాంటి ఆలోచన చేసిన తొలి సెలబ్రిటీ జంట విజయ్ - రష్మికే కావొచ్చు. ఇక తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త జంటకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఆనవాయితీ. దీని ప్రకారం విజయ్ దేవరకొండ పూర్వీకుల గ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్‌పేటకు విజయ్- రష్మికలు విచ్చేసి అక్కడి నివాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు తన భార్య రష్మికను పరిచయం చేశారు విజయ్. అంతేకాదు ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు విజయ్ దేవరకొండ.
అనంతరం ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. ఈ సందర్భంగా అభిమానులకు కొత్త జంట స్వయంగా వడ్డించింది. వారితో సెల్ఫీలు దిగుతూ.. ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేసింది విరోష్ జోడీ. తర్వాత విజయ్ - రష్మికలు కూడా అభిమానులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తన భర్తకు స్వయంగా తినిపించింది రష్మిక. ఇక ఈ విందును పురస్కరించుకుని రష్మిక మందన్న తెలుగింటి కోడలిగా అందంగా ముస్తాబై వచ్చారు. పద్దతిగా చీర కట్టుకుని మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం ధరించి భర్త విజయ్ దేవరకొండ చేతిలో చెయ్యేసి నడుస్తూ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినా పెళ్లి కాగానే ఇల్లాలి పాత్రలోకి మారిపోతారని రష్మిక సైతం నిరూపించిందని పోస్టులు పెడుతున్నారు.
ఇదిలాఉండగా.. విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు తరలిరానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలను తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా విజయ్, రష్మికలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











