అయ్య బాబోయ్.. రష్మిక మందన్నా పెళ్లి మేకప్ ఖర్చు అన్ని కోట్లా?

Virosh: టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సుమారు వారం రోజుల పాటు జరిగిన వీరి వివాహం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. అయితే.. తాజాగా వీరి రాయల్ వెడ్డింగ్ సంబంధించిన పలు విషయాలు, ఖర్చులపై కూడా ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

కోట్లలో పెళ్లి ఖర్చు?
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినప్పటికీ వారం రోజుల పాటు వివాహ వేడుకలు నిర్వహించినట్లు టాక్. ఉదయ్‌పూర్‌లో ప్రధాన కార్యక్రమాలు, విజయ్ స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం, అభిమానులకు విందు, సంగీత్ కార్యక్రమం, దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరకు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారని సమాచారం.

Rashmika Mandanna Wedding Makeup Cost 2 Crore Vijay Deverakonda Wedding Buzz

మొత్తం పెళ్లి ఖర్చు సుమారు రూ.15 కోట్ల వరకు అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పెళ్లి కోసం సుమారు 3 కిలోల బంగారం కొనుగోలు చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాహ నిర్వహణ బాధ్యతలను దేశంలోని ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారని చెబుతున్నారు.

రష్మిక మేకప్‌ ఖర్చే రెండు కోట్లు?
ఈ పెళ్లి చర్చలో మరో సంచలన అంశం రష్మిక మేకప్ ఖర్చు. కొన్ని సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. రష్మిక తన బ్రైడల్ మేకప్ కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త వినగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకల్లో అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటారు. కానీ రూ.2 కోట్ల మేకప్ అనేది నిజమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వైరల్ వార్తల్లో నిజమెంత?
నిజానికి సోషల్ మీడియాలో వైరవుతున్న ఈ అంశం అతిశయోక్తిగా ఉండని కొందరు అంటున్నారు. ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేయడం సాధారణమే కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చాలా అరుదని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో అధికారికంగా ఎక్కడా ధృవీకరణ లేదు. అయినప్పటికీ 'రష్మిక మేకప్‌కు రూ.2 కోట్లు ఖర్చు' అనే ప్రచారం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

ఇతర సెలబ్రిటీల మేకప్ ఖర్చులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. పలువురు ప్రముఖ బాలీవుడ్ నటీమణులు తమ పెళ్లి వేడుకల్లో మేకప్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల ప్రకారం ఐశ్వర్య రాయ్ తన వివాహ సమయంలో సుమారు రూ.75 లక్షలు, అలియా భట్ తన పెళ్లి మేకప్ కోసం దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పరిణీతి చోప్రా సుమారు రూ.35 లక్షలు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సుమారు రూ.26 లక్షలు, కియారా అద్వానీ కూడా దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతోంది.

రష్మిక మేకప్ ఖర్చు గురించి వస్తున్న వార్తలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు."మేకప్‌కే రెండు కోట్లు?" అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే కావచ్చని అంటున్నారు. ఇలా రష్మిక పెళ్లి, పెళ్లి ఖర్చులు గురించి వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇందులో నిజమెంత, ప్రచారమెంత అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X