నాని సినిమాతో బాలీవుడ్‌లోకి రష్మిక.. సెట్ చేసింది ఆ హీరోనేనట
కెరీర్ మంచి ఊపుమీదున్న దశలో 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి చిత్రాలతో వరుస పరాజయాలను చవి చూశాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాల తర్వాత అతడు నటించిన చిత్రం 'జెర్సీ'. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

రీమేక్ చేస్తామంటూ..
తెలుగులో ఘన విజయం సాధించిన ‘జెర్సీ'ని రీమేక్ చేస్తామంటూ ఇతర భాషలకు చెందిన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముందుకు వచ్చారు. క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీనిపై అన్ని ఇండస్ట్రీలు కన్నేశాయి. అలాగే, మనదేశంలో క్రికెట్‌కు ఎంతో మంది అభిమానులు ఉండడంతో ఈ సినిమా ఏ భాషలో తీసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో వారంతా చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు సైతం జరిపారు.

ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు కలిసి హిందీలోకి..
‘జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే, ఈ సినిమాకు వరుణ్ ధావన్, షాహీద్ కపూర్‌లలో ఒకరిని తీసుకోవాలని ఈ ఇద్దరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

హిందీ నిర్మాత కూడా..
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాను తెలుగు నిర్మాతలతో పాటు హిందీ నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా ప్రొడ్యూస్ చేస్తారట. ఈ విషయానికి సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయని తెలుస్తోంది. దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడంతో పాటు హై లెవెల్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది.

రష్మికను తీసుకుంటున్నారట
ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నారని తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల ముంబైలో ‘డియర్ కామ్రేడ్' స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లిన సమయంలో విజయ్ దేవరకొండతో.. కరణ్ జోహార్ ‘జెర్సీ' రీమేక్ విషయం చర్చించాడట. అప్పుడు హీరోయిన్‌గా రష్మికను సూచించాడట విజయ్. దీనికి కరణ్ కూడా ఓకే చెప్పేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











