ఏకంగా అమితాబ్ బచ్చన్‌తో.. రష్మిక మందన్న జోరుకు అంతా షాక్
ప్రస్తుతం రష్మిక మందాన్న జోరు చూస్తుంటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతోంది. కార్తీ సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లో రష్మిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు విడుదలైన సుల్తాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రష్మిక పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. అలా కోలీవుడ్‌లో మంచి ఎంట్రీ లభించింది. ఇక ఇప్పుడు రష్మిక బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది.

నేషనల్ క్రష్..
మామూలుగానే రష్మికకు నేషనల్ లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే రష్మికను గూగుల్ నేషనల్ క్రష్‌గా ప్రకటించేసింది. టాప్ టక్కర్ ఆల్బమ్‌తో నార్త్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించేందుకు రెడీ అవుతోంది.

బాలీవుడ్ ఎంట్రీ..
రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో కన్ఫామ్ అయింది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా వస్తోన్న మిషన్ మజ్ను చిత్రంతో రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతోంది. అయితే ఈ మొదటి చిత్రం పూర్తి కాక ముందే మరో ఆఫర్ వచ్చింది.

మెగా ఆఫర్..
బాలీవుడ్‌లో రష్మిక మొదటి ప్రాజెక్ట్ పూర్తి కాకముందే మరో చాన్స్ కొట్టేసింది. అది కూడా అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సినిమాలో చాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఏక్తా కపూర్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న గుడ్ బైచిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

పూజా కార్యక్రమాలు..
గుడ్ బై సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ గురించి రష్మిక చెబుతూ ఓ పోస్ట్ చేసింది. నటించడం అంటే నాకు ఇష్టం.. ఇది కూడా అలాంటి ఓ ప్రాజెక్ట్.. గుడ్ బై సినిమాలో భాగస్వామిని అయినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందంటూ రష్మిక తెలిపింది.


Click it and Unblock the Notifications











