గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడ్చేస్తున్న రష్మిక మందన్న.. శ్రీవల్లి లైఫ్ లో అదొక్కటే అసంతృప్తి

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకుంటోంది. ఈ సందర్భంగా రష్మిక మందన్న మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస బ్లాక్ బ్లాస్టర్ ను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఆమె రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా, రష్మిక మందన్నకు తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలాంటి ఢోకా లేక పోయినా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఓ అసంతృప్తి మిగిలి ఉండిపపోయిందంట. దాని గురించి రష్మిక మందన్న ఇలా చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మిక మందన్న ఫ్యామిలీ..
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో 1996 ఏప్రిల్ 5న సుమన్, మడన్ దంపతులకు జన్మించింది రష్మిక మందన్న. వారికి ప్రథమ పుత్రిక ఈమెనే కావడం విశేషం. ఆమె తండ్రికి కాఫీ ఎస్టేట్ తోపాటు ఒక ఫంక్షన్ హాలు కూడా ఉండటం విశేషం. ఇక రష్మిక మందన్నకు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు షిమన్. వీరిద్దరికి 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇక వారి కుటుంబ ఎంతో కష్టపడి ఆర్థికంగా ఎదిగింది. రష్మిక మందన్న కాలేజీలో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

Rashmika Mandanna worried for off Days

రష్మిక మందన్న చెల్లి కోసం..
ఇక ఇటీవల రష్మిక మందన్న తన చెల్లి షిమన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లైఫ్ లో తన చెల్లిని ఎంతగానో మిస్ అయినట్టుగా చెప్పింది. అయితే తన సిస్టర్ ఎదిగే సమయంలో తన చదువులు ప్రారంభం కావడం కారణంగా ఎక్కువ సమయం గడప లేకపోయానని చెప్పుకొచ్చింది. ఇక తన చెల్లిని చూసేందుకని, కలిసి సమయం గడిపేందుకు సెలవుల కోసం చాలా ఏడ్చేసేదంట. ఇప్పటి కూడా తన చెల్లితో ఎంతో సమయం గడపాలని ఉంటుందని, కానీ వర్క్ వల్ల కొన్ని సమయాల్లో కుదరని చెప్పుకొచ్చినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం రష్మిక మందన్న చెల్లెలు తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటోంది.

భారీ చిత్రాలతో సెన్సేషన్ గా..
తొలుత రష్మిక మందన్న కన్నడ చిత్రంతో హీరోయిన్ గా మారింది. కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత తెలుగులోకి ఛలో, గీతా గోవిందం, భీష్మ వంటి చిత్రాలతో ఎంట్రీ ఇచ్చి హిట్స్ అందుకుంది. ఇక మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. పుష్పతో నేషనల్ క్రష్ గా మారింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది.

శ్రీవల్లి రాబోయే చిత్రాలు..
ఏడాదిన్నరలోనే శ్రీలీలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యానిమల్, పుష్ఫ 2, ఛావా, సికిందర్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకుంది. రీసెంట్ గా ధనుష్ సరసన కుబేరా అనే చిత్రంలో నటించి మెప్పించింది. ఇక నెక్ట్స్ ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మైసా, హిందీలో థామా అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X