మగాళ్లకి కూడా పీరియడ్స్ వస్తే.. ఆ బాధ అర్థమవుతుందంటున్న రష్మిక

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి రష్మిక మందన్నా. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను హృదయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ 'నేషనల్ క్రష్' మారింది. ఆమె ఇప్పుడు పాన్‌ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తోంది. భాషల మధ్య తేడా లేకుండా సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదిస్తోంది. తాజా రష్మిక .. మగవారిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ఛలో' సినిమాతో వచ్చింది. నాగశౌర్య సరసన నటించిన ఆ చిత్రం భారీ హిట్ కావడంతో రష్మికకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి.దాని తర్వాత గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత రష్మికకు తిరిగి వెనక్కి తిరిగే పరిస్థితే రాలేదు. భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో స్టార్ లిస్ట్‌లో తన పేరు చేర్చుకుంది.

Rashmika Mandanna s Bold Periods Comment Goes Viral Ahead of The Girlfriend Release

కానీ నిజంగా ఆమెను దేశవ్యాప్తంగా స్టార్ చేసింది అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' సినిమా. "శ్రీవల్లి" పాత్ర నటించి, మెప్పించింది. ప్రధానంగా 'సామీ సామీ' సాంగ్‌తో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, విక్కీ కౌశల్తో చేసిన ఛావా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఇక సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ చిత్రం అంచనాలను అందుకోకపోయినా, ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇటీవలి కాలంలో విడుదలైన కుబేరా, థామా సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా, ప్రతి రెండు నెలలకోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త పాత్రలో వస్తూ బిజీగా కొనసాగుతోంది.

రష్మిక నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఇక రష్మిక మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మైసా'లో నటిస్తోంది. అలాగే..ఓ బాలీవుడ్ సినిమా కూడా లైన్‌లో పెట్టింది. ఇక రష్మిక - విజయ్ దేవరకొండ జంట మరోసారి కలిసే అవకాశం కూడా ఉంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో వీరిద్దరూ నటించనున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా రష్మిక తాజాగా నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా" టాక్ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమె తన చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు, సరదా సంఘటనలు పంచుకుంది. ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మాత్రం షోలో హైలైట్‌గా మారింది. ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ పై జగపతిబాబు అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానమిస్తూ.. "మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది. అప్పుడు ఆడవాళ్లు అనుభవించే నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ తెలుస్తాయి. అప్పుడే వారికి అమ్మాయిల పరిస్థితి అర్థమవుతుంది."అని చెప్పింది.

ఆ కామెంట్స్ విన్న ఆడియెన్స్ నిలబడి చప్పట్లు కొట్టారు, జగపతిబాబు కూడా రష్మికను ప్రశంసిస్తూ, "నువ్వు చెప్పినది నిజం, ఇది ప్రతి మగవాడు ఆలోచించాల్సిన విషయం" అని అన్నారు. ఈ సమాధానం సోషల్ మీడియాలో ఫెమినిస్ట్ స్టేట్‌మెంట్‌గా మారింది.ఆమె చెప్పిన మాటలు ఒక సాధారణ చర్చ కంటే ఎక్కువగా మహిళా అనుభవాలపై అవగాహన కలిగించే మెసేజ్‌గా మారాయి. అభిమానులు "రష్మిక మరోసారి మహిళల కోసం మాట్లాడింది" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదెలా ఉంటే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా విడుదలతో రష్మిక మరొక సక్సెస్ స్టోరీని తన ఖాతాలో నమోదు చేసుకోబోతోందని అభిమానులు విశ్వసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X