"18 ఏళ్లకే డేటింగ్ ఏంట్రా.. సిగ్గు లేదా?" అంటూ రష్మిక మందన్న ఫైర్..!
సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna), ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. స్టార్ హీరోలతో భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక బిజీగా గడుపుతోంది. తాజాగా విద్యార్థులతో కలిసి చిట్‌చాట్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె తన సినీ జర్నీ, వ్యక్తిగత అనుభవాలు, విజయ్ దేవరకొండపై ఉన్న రూమర్స్ గురించి మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రమోషన్స్ లో భాగంగా విద్యార్థులతో ఓ చిట్ చాట్ లో పాల్గొంది. ఈ సమయంలో ఒక విద్యార్థి "మీ గురించి చక్కర్లు కొడుతున్న నిజమైన రూమర్ ఏంటి?" అని అడగగా రష్మిక నవ్వుతూ "నేను ఏమి చెప్పగలను? మీ అందరికీ అది బాగా తెలుసు!" అంటూ చమత్కరించింది. ఈ సమాధానంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. కానీ అభిమానులు మాత్రం ఇది విజయ్ దేవరకొండను సూచిస్తూ చెప్పిందని భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి పలు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఒక విద్యార్థి "నాకు 18 సంవత్సరాలు, నేను డేటింగ్ చేయాలనుకుంటున్నా, మీ సలహా ఏంటి?" అని అడగగా రష్మిక వెంటనే "సిగ్గు లేదా రా నీకు? 18 లోనే డేటింగ్ కావాలా నీకు?" అంటూ సీరియస్ అయ్యింది. అయినా ఆ షోలో రష్మిక ఎక్స్‌ప్రెషన్స్ కు నవ్వుల పూవ్వులు పూశాయి. మరొకరు "పుష్ప 3 ఎప్పుడు వస్తుంది?" అని అడగగా ఆమె తనదైన చమత్కారంతో "ఆ బాంబ్ బ్లాస్ట్ కావడానికి ఇంకా టైం ఉంది!" అని సమాధానమిచ్చింది.
ఇక గతంలో రష్మికపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానిపై స్పందిస్తూ ఆమె "క్యాన్ యు లీవ్ దట్?" అంటూ కొంత సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఈ సమయంలో ఆడియన్స్ ఆమె ముఖంలో కనిపించిన అసహనం గమనించారు. ఒక విద్యార్థి "మీరు ఎప్పుడైనా ఏడ్చారా?" అని అడగగా రష్మిక ఎమోషనల్ అయి "లాస్ట్ టైమ్ మా ఇంట్లో ఐటీ రైడ్ జరిగింది. చాలా మంది ఆఫీసర్లు ఒక్కసారిగా ఇంటికి వచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అది నాకు చాలా భయంకరమైన అనుభవం. నేను అప్పుడే ఏడ్చాను. ఎప్పుడూ బహిరంగంగా ఏడవకండి, మీరు ఎదుర్కొంటున్నది అందరికీ తెలియనివ్వకండి" అని చెప్పింది.
ఇంత స్టార్‌డమ్ ఉన్న మీరు 'ది గర్ల్‌ఫ్రెండ్'లో నటించడం ఎందుకు అని అడగగా ఆమె "నేను నటిని. నా నటనను ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను పరీక్షించుకోవడానికి ఆ సినిమాను ఒప్పుకున్నాను. ఈ కథలో ఉన్న భావోద్వేగాలు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి" అని వివరించింది. మరో విద్యార్థి "కెమెరాలు ఆఫ్ ఉన్నప్పుడు రియల్ రష్మిక ఎవరు?" అని అడగగా ఆమె "ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న! ఆన్ కెమెరా ఉన్నప్పుడు నేను ఫన్‌గా ఉంటాను కానీ ప్రైవేట్‌గా చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా ఉంటాను" అని చెప్పింది.
తన సక్సెస్ గురించి మాట్లాడుతూ "స్కూల్లో ఉన్నప్పుడు నాకు చాలామంది 'ఈ అమ్మాయి వేస్ట్' అని అనేవారు. ఎవరో ఒకరు 'ఇదికీ ఛాన్స్ లేదు' అని కామెంట్ చేసేవారు. కానీ నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లనే నేను ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నాను" అని గుర్తుచేసుకుంది. మొత్తంగా రష్మిక మందన్నా ఈ ఇంటర్వ్యూలో తన ఫన్నీ, ఫియర్స్, ఎమోషనల్ చూపించింది. 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఈ బోల్డ్ హనేస్టీ ఆన్సర్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











