Remuneration: రష్మిక మందన్నకు రికార్డు రెమ్యునరేషన్.. సల్మాన్ ‘సికిందర్’ మూవీకి ఎన్ని కోట్ల పారితోషికం!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా దక్షిణాది స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సికందర్. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మాణంలో నాడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో రష్మిక రెమ్యునరేషన్ విషయం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ ఎంత పారితోషికం తీసుకొన్నదనే వివరాల్లోకి వెళితే..
సౌత్ ఇండస్ట్రీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ వెళ్లిన రష్మిక మందన్నకు తొలి నాళ్లలో పెద్దగా సక్సెస్ లభించలేదు. కానీ ఆమె తన కెరీర్ గ్రాఫ్ పెంచే సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే రష్మికకు లభించిన చిత్రం యానిమల్. యానిమల్ బ్లాక్ బస్టర్‌గా మారడంతో ఈ బ్యూటీపై అందరి దృష్టి పడింది. ఆ తర్వాత అనేక ఆఫర్లు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి.

యానమిల్ సినిమా తర్వాత నేషనల్ క్రష్‌ను వెతుక్కొంటూ వచ్చిన సినిమా ఛావా. ఛావా చిత్రంలో యేసు బాయిగా ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకొన్నది. క్రిటిక్స్ నుంచి సాధారణ ప్రజల వరకు ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు. దాంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. హిందీ సినిమా పరిశ్రమలోను ఆమె క్రేజ్ రెండింతలు పెరిగింది. దాంతో ఆమె రెమ్యునరేషన్ గణనీయంగా పెరిగిందని సినీ వర్గాలు అంటున్నారు.
యానిమల్ సినిమా తర్వాత రష్మికను వెతుక్కొంటూ వచ్చిన చిత్రం సికందర్. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నది. సికందర్‌లో కాజల్ అగర్వాల్ ఉన్నప్పటికీ.. ఆమెనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. రష్మిక గ్లామర్‌పైనే అందరి చూపు పడింది. ఇలా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన ఆమెకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ ప్రచారం అవుతున్నది.

యానిమల్, ఛావా సినిమాల తర్వాత రష్మికకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ పెరిగింది. ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఆమె మాత్రం తన కెరీర్‌కు ఉపయోగపడే సినిమాలను, కథలను ఎంచుకొంటున్నది. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో మాత్రమే కనిపించేందుకు తన రోల్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకొంటున్నది. ఈ క్రమంలో ఆమె పెడుతున్న డిమాండ్స్‌కు మేకర్స్ కూడా సై అంటున్నారనేది తాజా సమాచారం.
అయితే సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఆఫర్‌ను సొంతం చేసుకొన్న యానిమల్ హీరోయిన్‌కు భారీ మొత్తాన్ని అందుకొన్నారు. ఈ సినిమా కోసం సుమారుగా 5 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకొన్నట్టు తెలిసింది. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొన్న హీరోయిన్లలో ఒకరిగా రష్మిక మందన్న చేరిందనే మాట వినిపిస్తున్నది. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లు దీపిక, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు దాదాపు రిటైర్ అయిపోయినట్టు భావిస్తున్న నేపథ్యంలో రష్మికకు మంచి డిమాండ్ పలుకుతుందని క్రిటిక్స్ ఆమె కెరీర్‌ను విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











