నితిన్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న రష్మిక!
ఛలో చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన ఆ తరువాత గీత గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో రష్మిక ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. రశ్మికకు ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. గీత గోవిందం చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది. రష్మిక మరోమారు విజయ్ దేవర కొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది.
మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ లో నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా రష్మిక మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రష్మికని ఛలో చిత్రంతో దర్శకుడు వెంకీ కుడుముల తెలుగు తెరకు పరిచయం చేశాడు. వెంకీ ప్రస్తుతం నితిన్ తో ఓ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కు ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రక్షిత్ తో బ్రేక్ అప్ విషయంలో రష్మిక వార్తల్లో నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











