Rashmika's Pushpa 2 Review: పుష్ప 2 పై రష్మిక రివ్యూ.. నేషనల్ క్రష్ ఓ రేంజ్ ఎలివేషన్
Rashmika's Pushpa 2 Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ( Pushpa the Rule ). ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్, టీజర్స్ తో పుష్ప 2 పై అంచనాలు అమాంతం పెరిగాయి. అలాగే.. అప్పుడప్పుడూ వస్తున్న లీక్స్ కూడా హైప్స్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా.. హీరోయిన్ అందాల భామ రష్మిక మందన్న పుష్ప 2పై తన రివ్యూ ఇచ్చి.. అల్లు అర్జున్ సినిమాపై హైప్‌ను మరింతగా పెంచేసింది. వివరాల్లోకెళ్తే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో నవంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు పాట్నాలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తోంది.

పుష్ప-2 పై హైప్స్ క్రియేట్ అయ్యేలాగా పలు అప్డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతుందని మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట మాస్ స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందేనని ఫాన్స్ సంబురపడుతున్నారు. అలాగే ఈ మూవీకి హైలెట్ గా నిలిచే.. గంగమ్మ జాతర ఎపిసోడ్ దాదాపు 15 నుండి 18 నిమిషాలు ఉంటుందని, ఈ జాతర ఫైట్స్ కు దాదాపు 60 కోట్లు ఖర్చు చేశారని ఇండస్ట్రీ టాక్. అలాగే విడుదలకు నెల రోజుల ముందే పుష్ప 2.. రూ 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా రోజుకు అప్డేట్ ఇస్తూ మూవీ పై అంచనాలను పెంచేస్తున్నారు.
పుష్ప 2 .. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పుష్ప 2 సినిమాపై రివ్యూ ఇచ్చేంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ క్రమంలోనే పుష్ప 2కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. పుష్ప 2లో శ్రీవల్లి పాత్రకు తాను డబ్బింగ్ చెబుతున్నానని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. అందులో ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను లీక్ చేసింది.



Click it and Unblock the Notifications











