రేప్ సీన్లలో ఆ పని జరుగొద్దు.. అందుకే లిప్‌లాక్స్‌కు వ్యతిరేకం.. రవీనా టాండన్ క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కేవలం హిందీ సినిమాకే పరిమితం కాకుండా.. తెలుగు, కన్నడ, దక్షిణాది రంగాల్లో తనదైన పాత్రలతో అలరించారు. పెళ్లికి ముందు బాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించారు. ఇక తెలుగు, కన్నడలో కూడా బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో జతకట్టారు. పెళ్లి తర్వాత ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోష్‌ను కొనసాగిస్తున్నారు. ఆమె నటించిన అరణ్యాక్ రెండో సీజన్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలో తన కెరీర్ అనుభవాల గురించి రవీనా టాండన్ వెల్లడిస్తూ..

పత్తర్ కీ పూల్ సినిమాతో

పత్తర్ కీ పూల్ సినిమాతో


రవీనా టాండన్ కెరీర్ విషయానికి వస్తే.. పత్తర్ కీ ఫూల్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పరంపర, ఏకీ హీ రాస్తా, దివ్య శక్తి లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా పాపులారిటి సంపాదించుకోలేదు. అలాంటి సమయంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్నో మంచి పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

రథసారథి చిత్రంతో తెలుగులో.. బాలకృష్ణతో అలా

రథసారథి చిత్రంతో తెలుగులో.. బాలకృష్ణతో అలా


రవీనాటాండన్ తెలుగులో రథసారథి అనే చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో నటిస్తుండగానే.. నందమూరి బాలకృష్ణతో బంగారు బుల్లోడు సినిమాలో నటించారు. ఆ చిత్రంలో మంచి నటనతోపాటు.. ఆమె స్టెప్పులేసిన స్వాతిలో ముత్యమంత పాట భారీ హిట్ అయింది. బంగారు బుల్లోడు తర్వాత తెలుగులో అవకాశాలు భారీగా వచ్చినా.. హిందీ సినిమాకే పరిమితయ్యారు.

తూ చీజ్ బడీ మస్త్ అంటూ రవీనా

తూ చీజ్ బడీ మస్త్ అంటూ రవీనా


బంగారు బుల్లోడు తర్వాత రవీనా టాండన్ నటించిన దిల్ వాలే, లాడ్లా, అందాజ్ అప్నా అప్నా సినిమాలు హిట్ కావడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. మొహ్రా సినిమాలో అక్షయ్ కుమార్‌తో నటించడమే కాకుండా తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ వేసిన స్టెప్పులు దేశవ్యాప్తంగా కుర్రకారుకు గిలిగింతలు పెట్టాయి. అప్పటి నుంచి మస్త్ బేబీ అంటూ రవీనాకు భారీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత నాగార్జునతో ఆకాశ వీధిలో, మోహన్ బాబుతో పాండవులు పాండవులు తుమ్మెద, ఇటీవల కేజీఎఫ్2 చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది.

వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి రవీనా

వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి రవీనా


రవీనా టాండన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అరణ్యాక్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే తనకు దూకుడుతనం, తలబిరుతనం ఉందనే విషయంపై స్పందించారు. అయితే తన పాత్రలు, సీన్ల చిత్రీకరణ విషయంలో నాకు కచ్చితమైన విధానాలు, నిర్ణయాలు ఉండేవి. ఎదుటివాళ్లు ఏమనుకొంటారో అనే విషయాన్ని పట్టించుకొనేదానిని కాదు. నా మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని అనుకొనే దానిని. అందుకే నన్ను అలా కామెంట్ చేసేవారు అని రవీనా టాండన్ చెప్పారు.

రేప్ సీన్లు చేసేటప్పుడు

రేప్ సీన్లు చేసేటప్పుడు

నిర్మాతలకు షరతులు విధించడంపై రవీనా టాండన్ స్పందిస్తూ.. రేప్ సీన్లను చిత్రీకరించేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండేదానిని. నేను ధరించిన బట్టలు చినిగిపోవద్దు. అలాగే నా బట్టలు ఒంటిపై నుంచి వెళ్లిపోవద్దని ముందే షరతు విధించే దానిని. రేప్ సీన్ల చిత్రీకరణ విషయంలో నాకు కంఫర్ట్ ఉండాలి. నాకు అసౌకర్యంగా ఉంటే నేను అలాంటి సీన్లు చేయనని ముందే హెచ్చరించే దానిని. నాకు కొన్ని విషయాలపై సెట్లో స్పష్టమైన అవగాహన ఉండేది అని రవీనా టాండన్ చెప్పారు.

నో బికినీస్.. లిప్ లాక్స్

నో బికినీస్.. లిప్ లాక్స్

రవీనాటాండన్ స్విమ్మింగ్, బికినీ సీన్లు, లిప్‌లాక్స్‌లో నటించే విషయం గురించి తెలియజేస్తూ.. బికినీలు వేయనని ముందే చెప్పేదానిని. స్విమ్మింగ్ డ్రస్సులు వేసుకొంటే.. నాకు నచ్చినట్టు ఉండాలని చెప్పేదానిని. కిస్ సీన్లు చేయనని నిర్మాతకు ముందే చెబుతుండే దానిని. అలాంటి షరతుల వల్ల నేను నా కెరీర్‌లో ఒకట్రెండు తప్ప.. ఎక్కువ రేప్ సీన్లలో నటించలేదు అని రవీనా టాండన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X