ఆ హీరోతో బ్లాక్ బస్టర్ పాటకు డ్యాన్స్.. షూటింగ్ తర్వాత ఆ ఇంజెక్షన్లు తీసుకొన్నా.. రవీనా టాండన్
సినిమాల్లో పాటలు వస్తే ప్రేక్షకులు ఎలా రెచ్చి పోయి విజిల్స్ వేస్తుంటారో మనకు తెలుసు. అలాగే పాటలు వస్తుంటే కొందరు దమ్ము కొట్టడానికి బయటకు లేచి వెళ్తుంటారు. అలాంటి పాటలను ప్రేక్షకులకు అందించాలని ఎంత కష్టపడుతారనే విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. తమకు నచ్చిందా? లేదా అనేదే తుది తీర్పు. అయితే ఓ పాటలో నటించినందుకు తాను ఎలాంటి కష్టాలు పడ్డాను.. ఆ షూటింగ్ తర్వాత తన పరిస్థితి ఏమిటనే విషయాన్ని సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఆ షాకింగ్ వివరాల్లోకి వెళితే..
రవీనా టాండన్ అంటే మంచి ఫెర్ఫార్మెర్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకొన్నది. 90వ దశకంలో ఆమె నటించిన సినిమాలే కాకుండా పాటలు కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.అలాంటి పాటల్లో ఎప్పటికి మరిచిపోలేనిది మొహ్రా సినిమాలో టిప్ టిప్ బర్సా పానీ పాట. అక్షయ్ కుమార్, రవీనా జంటగా నటించిన ఈ సాంగ్ ఇప్పటికీ యువత గుండెల్లో గిలిగింతలు పెట్టడమే కాకుండా పబ్‌లలో పెళ్లిళ్లలో ఈ పాట మార్మోగుతూనే ఉంటుంది.

రవీనా టాండన్ ఇటీవల కాలంలో కేజీఎఫ్2 సినిమాలో ప్రధాని పాత్రలో మరోసారి టాప్ లేపింది. అప్పుడప్పుడు రియాలిటీ షోకు గెస్టుగా వస్తుంటుంది.తాజాగా ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 3 అనే షోలో రవీనా టాండన్ గెస్టుగా హాజరయ్యారు. ఈ షోలో శివాంశు అనే కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ వివేక్ టిప్ టిప్ పాటపై డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఈ సందర్భంగా మొహ్రా సినిమాలోని టిప్ టిప్ బర్సా పానీ పాట షూటింగ్ గురించి చెప్పుకొచ్చారు.
టిప్ టిప్ బర్సా పానీ పాట షూట్‌ను ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో షూట్ చేశారు. ఈ పాటలో చెప్పులు, షూస్ కూడా వేసుకోవద్దని చెప్పారు. కాళ్ల కింద గచ్చు. మొలలు నాకు చాలా ఇబ్బంది పెట్టాయి. ఓ పక్క చీరకట్టులో వర్షంలో పాట. వానలో తడుస్తూ కింద కాళ్లు ఏవేవో గుచ్చుకొంటుంటే..డ్యాన్స్ చేశాను అని రవీనా టాండన్ చెప్పారు.
టిప్ టిప్ బర్సా పాటలో అక్షయ్ కుమార్‌తోపాటు నేను మోకాళ్లకు ప్యాడ్స్ పెట్టుకొన్నాం. చాలా సార్లు డ్యాన్స్ చేస్తూ పట్టు తప్పి పడిపోయాను. కానీ కాళ్లకు, చేతులకు, శరీరానికి భారీగా గాయమయ్యాయి. ఇంటికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకొన్నాను. ఆ తర్వాత ముందస్తుగా టీటీ ఇంజెక్షన్ తీసుకొన్నాను అని రవీనా టాండన్ తన బాధను పంచుకొన్నారు.

రవీనా టాండన్ కెరీర్ విషయానికి వస్తే.. కేజీఎఫ్: ఛాప్టర్ 2 సినిమాలో రిమికా సేన్ పాత్రతో మెప్పించారు. ప్రస్తుతం వన్ ఫ్రైడే నైట్, గుడ్‌చడీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











