అక్కడ వాంతులు శుభ్రం చేశా.. ఫ్రీగా మళ్ళీ మళ్ళీ.. రవీనా టండన్ షాకింగ్ కామెంట్స్
KGF: చాప్టర్ 2 సినిమాలో రమికా సేన్ అనే ప్రధాన మంత్రి పాత్రలో నటించిన రవీనా టాండన్ తన నటనకు చాలా ప్రశంసలు అందుకుంది. రవీనా టాండన్ 1991లో ''పత్తర్ కే ఫూల్'' అనే సినిమాతో సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మోహ్రా, లాడ్లా, దిల్‌వాలే, అందాజ్ అప్నా అప్నా వంటి సూపర్‌హిట్ చిత్రాల ద్వారా చాలా ఫేమస్ అయింది. అయితే స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఒకప్పుడు స్టూడియో ఫ్లోర్‌ల మీద మనుషుల వాంతులను శుభ్రం చేసేదని మీకు తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాతో పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

క్లీనింగ్ వర్క్
బాలీవుడ్ స్టార్ కిడ్స్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. నేటి యంగ్ స్టార్ కిడ్స్ గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. బాలీవుడ్ స్టార్ పిల్లలు కష్టపడాల్సిన అవసరం లేదని అనిపించినప్పటికీ, ప్రతి వ్యక్తికి తనదైన జీవిత కథ ఉంటుందనే విషయం రవీనా టాండన్ బయట పెట్టింది. ఇప్పుడు అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్న రవీనా టాండన్ ఒకప్పుడు స్టూడియోలో క్లీనింగ్ వర్క్ చేసేవారు. ఈ విషయాన్ని స్వయంగా రవీనా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

ప్రహ్లాద్ కక్కర్ వల్లే
రవీనా టాండన్ 1991లో 'పత్తర్ కే ఫూల్' సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ఆమె సినీ దర్శకుడు రవి టాండన్ కుమార్తె, అంటే ఆమె సినిమా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ వల్లే తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని రవీనా చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో, రవీనా తన కెరీర్ ప్రారంభంలో తన ఉద్యోగం స్టూడియోని శుభ్రం చేయడమే అని చెప్పింది. బాత్‌రూమ్‌లోని వాంతిని శుభ్రం చేయడానికి అక్కడ పనిచేశానని ఆమె చెప్పుకొచ్చింది.

ప్రహ్లాద్ కక్కర్ వల్లే
పదో తరగతి పూర్తి చేశాక ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాను. ఆ సమయంలో ఇలాంటి పనులు చాలా చేశానని ఆమె వెల్లడించింది. అప్పుడు చాలా మంది నన్ను చూసి నువ్వు స్క్రీన్ ముందు ఉండాల్సినదానివి అనేవారు. ఆ మాటలు విని నేనా? నటిగా మారడామా? అస్సలు ఛాన్సే లేదు అని సమాధానం చెప్పేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది. పెద్దయ్యాక నటిని అవుతానని అనుకోలేదు, నేను అనుకోకుండా చివరకు నటిగా మారానని చెప్పుకొచ్చింది.

ఫ్రీగా మళ్ళీ మళ్ళీ
ప్రహ్లాద్ దగ్గర పనిచేసినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో వెంటనే రవీనాను పిలవండి అనేవారని నన్ను మేకప్ వేసుకుని ఫొటోకు పోజులు ఇవ్వమని అడిగే వాడట. అయితే ఇదంతా ప్రహ్లాద్ కోసం ఫ్రీగా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెయ్యాలి ? దాని నుండి పాకెట్ మనీ ఎందుకు సంపాదించకూడదు అనుకున్నాను.

అవన్నీ నేర్చుకున్నా
అందుకే మోడలింగ్ ప్రారంభించాను. ఆ తర్వాత నాకు సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అప్పుడు నాకు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ గురించి ఏమీ తెలియదు. నేను సమయం గడిచిన కొద్దీ అవన్నీ నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. మొత్తం మీద ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.


Click it and Unblock the Notifications











