అమ్మమ్మ కాబోతున్న రవీనా టాండన్.. కూతురుకు గురించి తెలిస్తే షాకే!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అమ్మమ్మ కాబోతున్నది. తన దత్త పుత్రిక ఛాయ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. తన దత్త పుత్తిక ఛాయకు షాన్ మెండిస్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తన కూతురు గర్భవతి అయిందని తెలుపుతూ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో దత్త పుత్రిక ఛాయతోపాటు, పూజా టాండన్, రణ్‌బీర్, రాషా తండానీ, రవీనా ఉన్నారు. నేను నా దత్త పుత్రిక.. నా పాప కడుపులో మరో బేబీ.. కౌంట్ డౌన్ మొదలైంది అంటూ రవీనా ట్వీట్ చేసింది.

రవీనా దత్త పుత్రిక ఛాయా తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె సన్నిహితులు, స్నేహితులు సంతోషంలో మునిగిపోయారు. అలాగే రవీనా దయ, ప్రేమ, అభిమానాలను పలువురు ప్రశంసించారు. రవీనా గొప్ప మనసు ఉన్న తల్లి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

Raveena Tandon set to become a grandmother soon

రవీనా విషయానికి వస్తే.. 1995లో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొన్నది. ఒకరు ఛాయ కాగా, మరోకరు పూజా. 2016లో ఛాయ వివాహం గోవాలో హిందూ, క్యాథలిక్ సంప్రదాయ పద్దతిలో షాన్ మెండిస్‌తో వివాహం జరిగింది.

రవీనా టాండన్ విషయానికి వస్తే.. 90వ దశకంలో బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. అక్షయ్ కుమార్‌తో మెహ్రా చిత్రంలో తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ పాటతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నది. తెలుగులో ఆకాశవీధిలో.. మోహన్‌బాబుతో పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో నటించింది. తమిళంలో అభయ్, కన్నడలో ఉపేంద్రతో ఓ చిత్రంలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X