twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతో పడుకోవడానికి నిరాకరిస్తే.. నన్ను అలా దారుణంగా.. బాలీవుడ్ గుట్టు విప్పిన రవీనా

    |

    బాలీవుడ్‌లో జరుగుతున్న అరాచకాలపై ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్నారు. గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సలియాన్ మరణాల అంశాలు హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో తనకు జరిగిన అన్యాయం, తన పట్ల కొందరు వ్యవహరించిన తీరుపై ప్రముఖ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీనా తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..

    బాలీవుడ్‌లో విష సంస్కృతి

    బాలీవుడ్‌లో విష సంస్కృతి

    బాలీవుడ్‌లో చాలా ఎక్కువ. తమ ఫ్యామిలీకి సంబంధించిన వారిని ప్రోత్సాహించడం (నెపోటిజం), తమకు సంబంధించిన వారికే అవకాశాలు ఇవ్వడం (ఫేవరిటిజం) చాలా ఎక్కువ. హీరోయిన్లతో హీరోలు చాలా విషపూరితంగా వ్యవహరించే సంస్కృతి మరీ ఎక్కువ. ఓ సినిమా ప్రారంభం అవుతుందనే కొద్ది గంటల ముందు హీరోయిన్లను తీసివేయడం జరుగుతుంటుంది. అలాంటి అనుభవాలను చాలా ఎదుర్కొన్నాను అని రవీనా టాండన్ చెప్పారు.

    నాకు తల పొగరు అంటూ

    నాకు తల పొగరు అంటూ

    నాకు తల పొగరు, అహంకారం ఎక్కువ అని బాలీవుడ్ హీరోలు భావిస్తారు. వారి పక్కలోకి వెళ్లి పడుకోవడానికి నేను నిరాకరించడం వల్లే నాకు వ్యతిరేకంగా అలాంటి ప్రచారం చేశారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్, వారికి చెంచాలుగా ఉండే జర్నలిస్టులను పావులుగా ఉపయోగించుకొని హీరోయిన్లను దెబ్బ తీస్తారు. కొందరు మహిళా జర్నలిస్టులు అలాంటి పావులుగా మారడం నాకు షాక్ కలిగించింది అని రవీనా టాండన్ అని అన్నారు.

    మహిళా జర్నలిస్టులు చెత్త రాతలు

    మహిళా జర్నలిస్టులు చెత్త రాతలు

    నేను స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులు నాపై చాలా దుష్ప్రచారం చేశారు. నా గురించి చాలా చెత్త రాతలు రాశారు. అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. దాంతో నా ఆఫర్లను చేజారిపోకుండా చూసుకొన్నాను. హిందీ ఇండస్ట్రీలో తడి గుడ్డతో గొంతులు కోసే రాజకీయాలు, మాఫియా ఉన్నాయి అని పింక్ విల్లా వెబ్‌సైట్‌తో రవీనా టాండన్ పేర్కొన్నారు.

    నా గురించి అవాస్తవాలు, అసత్యాలు

    నా గురించి అవాస్తవాలు, అసత్యాలు

    హీరోయిన్‌గా నా అవకాశాలను దెబ్బ తీసేందుకు మహిళా జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నించారు. నా గురించి అవాస్తవాలు, అసత్యాలు రాశారు. అయితే నేను వాళ్ల రాతలను పెద్దగా పట్టించుకోలేదు. నా పని ఏదో నేను చూసుకొంటూ నా కెరీర్‌ను జాగ్రత్తగా మలచుకొన్నాను. వాళ్ల రాతలను పట్టించుకోకపోవడంతో నిర్మాతల వద్ద చెడుగా చెప్పి అవకాశాలను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు అని రవీనా పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
    బాలీవుడ్‌లో మంచి, చెడుల గురించి

    బాలీవుడ్‌లో మంచి, చెడుల గురించి

    బాలీవుడ్‌లో అంతా చెడు ఉందని చెప్పను. ఇండస్ట్రీలో మంచి వాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే ఇతర పరిశ్రమల కంటే బాలీవుడ్‌లో రాజకీయాలు కాస్త ఎక్కువే. చెడ్డవాళ్లు మన కెరీర్‌‌ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకొంటారు. అలాంటి వారిని ఎదురించడంలో నేను సఫలమయ్యాను అని రవీనా చెప్పారు.

    English summary
    Bollywood actress Raveena Tandon shocking revelation about heroes sexual favours. He quoted pink villa that, how she being thrown out of a movie hours before its launch, toxic star culture and favouritism in Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X