లేడీగ్యాంగ్స్ వల్లే లైఫ్స్ నాశనం, హీరోలను తీసేస్తారు: సుశాంత్ గుండెలో ఇంత బాధనా? రవీనాటాండన్

సినీ పరిశ్రమలో జరిగే దందాలు, అరాచకాల గుట్టును అలనాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ విప్పింది. సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఎవరిని ఎవరు డిసైడ్ చేస్తారనే అనే విషయాలను పూసగుచ్టినట్టు చెప్పారు. సినీ పరిశ్రమలో పెత్తనం ఆడవాళ్ల గుంపు ఒకటి ఉంటుంది.. వారి వల్లనే ఇలాంటి దారుణాలు చోటుచేసుకొంటాయని సంచలన విషయాలు బయటపెట్టారు. రవీనా టాండన్ సంచలన రీతిలో ట్వీట్లు చేస్తూ మరో సంచలనానికి తెర తీసింది. ఆ ట్వీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon
గర్స్ గ్యాంగులతోనే జీవితాలు తారుమారు

గర్స్ గ్యాంగులతోనే జీవితాలు తారుమారు

బాలీవుడ్ పరిశ్రమలో క్యాంపులు ఉంటాయనేది వాస్తవం. ఆ క్యాంపు రాజకీయాల వల్లే సినీ తారల జీవితాలు ఒక్కోసారి తలకిందులు అవుతుంటాయి. అంతేకాకుండా ఫేక్ మీడియా స్టోరీలు రాసి కెరీర్లను నాశనం చేసే దందా కూడా సాగుతుంది. పలు రకాల క్యాంపులు సినీ పరిశ్రమను శాసిస్తాయిఅంటూ రవీనా టాండన్ సంచలన విషయాలను బయటపెట్టింది.

సినిమాలో ఎవరుండాలని వారే డిసైడ్

సినిమాలో ఎవరుండాలని వారే డిసైడ్

ఏ సినిమాలో ఎవరు ఉండాలని డిసైడ్ చేసే, అలాగే హీరోలను, హీరోయిన్లు ఎగతాలి చేసే, హీరోల సహాయంతో సినిమాల నుంచి కొందరి తీసేసేందుకు ప్రయత్నించే ఆడవాళ్ల గ్యాంగ్ సినీ పరిశ్రమలో బలంగా పనిచేస్తుంది. నచ్చకపోతే హీరోల గర్ల్‌ఫ్రెండ్స్‌‌ను సినిమాల నుంచి తొలగించడం, చెంచాలుగా వ్యవహరించే జర్నలిస్టులతో కలిసి ఫేక్ స్టోరీలు రాసి కెరీర్లను నాశనం చేసేందుకు అలాంటి గ్యాంగులు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎదురించి గెలిచే వారుంటారు? కొందరు ఓటమిని అంగీకరిస్తారు అంటూ రవీనా టాండన్ ట్వీట్ చేసింది. అలాగే పాత గాయాలను గుర్తు చేసుకొంటున్నాను అనే హ్యాష్ ట్యాగ్‌ను పెట్టడం గమనార్హం.

వాస్తవం మాట్లాడితే పిచ్చివాళ్లుగా ముద్ర

వాస్తవం మాట్లాడితే పిచ్చివాళ్లుగా ముద్ర

రవీనా టాండన్ చేసిన వరుస ట్వీట్లలో.. మరో ట్వీట్‌లో.. కొన్నిసార్లు వాస్తవాలు మాట్లాడితే.. అబద్దాల కోరుగా, పిచ్చివాళ్లుగా, సైకోటిక్‌గా ముద్రవేస్తారు. చెంచాలుగా వ్యవహరించే జర్నలిస్టులు వారికి అండగా ఉంటూ పేజీలకు పేజీలు కథనాలు రాస్తారు. ప్రతిభావంతులైన నటుల కెరీర్లను నాశనం చేస్తుంటారు. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా లబ్ది పొందాను. కానీ పాలిటిక్స్ వల్ల కొన్ని చేదు సంఘటనలు నాకు దారుణంగా బాధపెట్టాయి అని రవీనా టాండన్ పేర్కొన్నారు.

మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారు..

మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారు..


నాకు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఉంటే ఒత్తిడి చాలా ఎక్కువే. ఒక్కడ మంచి వాళ్లు ఉంటారు.. చెడ్డవాళ్లు ఉంటారు. అన్ని రకాల వారు కలిస్తేనే ఈ పరిశ్రమ. తమకు లభించిన అవకాశాన్ని అందుకొని ముందుకు పోవాల్సిందే. తప్ప చేసేది ఏముండదు అంటూ రవీనా టాండన్ మరో ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

డర్టీ పాలిటిక్స్‌పై పోరాడితేనే..

డర్టీ పాలిటిక్స్‌పై పోరాడితేనే..


అన్యాయం బయటి వారికే జరుగుతుందని అనుకోవద్దు. పరిశ్రమలో వారసత్వంగా వచ్చే వారికి కూడా ఇలాంటి అరాచకాలు ఎదురవుతుంటాయి. ఎవరైనా సరే.. బయటి వారు, లోని వారు అనే తేడా లేకుండా తనకు ఎదురయ్యే సమస్యలపై ప్రతీ ఒక్కరు పోరాడాల్సిందే. డర్టీ పాలిటిక్స్ ఎక్కడైనా ఉంటాయి. ఈ పాలిటిక్స్ గేమ్‌లో కొందరు విజయం సాధిస్తారు. మరికొందరు నష్టపడుతారు అంటూ మరో ట్వీట్‌లో రవీనా తన అనుభవాలను ఏకరువు పెట్టింది.

సుశాంత్ గుండెలో ఇంత బాధనా?

సుశాంత్ గుండెలో ఇంత బాధనా?

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రవీనా టాండన్ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో శ్రద్దాంజలి ఘటించింది. భావోద్వేగమైన సందేశాన్ని రాస్తూ సుశాంత్ ఉన్న ఓ జోష్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఉత్సాహవంతుడైన యువకుడు తన గుండెలోపల తీవ్రమైన విషాదాన్ని దాచుకొన్నట్టు ఎవరికి తెలుసు. అతని నవ్వు వెనుక, ఆటపాటల వెనుక విషాదం ఉందని ఎవరూ ఊహించకపోవచ్చు. అతడిని కేవలం రెండేసార్లు కలిశాను. అతడిని చూసినప్పుడు సిన్సియర్, టాలెంటెడ్, మంచి మనసు ఉన్న వ్యక్తి అనే ఫీలింగ్ కలిగిందని నిజాయితీగా చెబుతున్నాను అని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X