పడక గదిలోకి వస్తావా? డైరెక్టర్ బండారాన్ని బయటపెట్టిన రవితేజ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరిట అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఆఫర్లు ఇస్తామని ఆశ చూపి వారిని లొంగదీసుకోవడం, భయపెట్టడం కామన్ అయిపోయింది. జస్టిస్ హేమ కమిటీ ఇలాంటి పలు సంచలన విషయాలను వెల్లడించి ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాననీ, కమిట్మెంట్ ఇస్తే ఆఫర్లు ఇస్తానని ఓ డైరెక్టర్ అడిగాడు అంటూ షాకింగ్ విషయాలను బయట పెట్టింది.
జస్టిస్ ఏమా కమిటీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక దాడులపై పలు సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ఎదుట పంచుకున్నారు. పలువురుపై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) .. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని వెల్లడించింది. కావ్య థాపర్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. పలు పలు యాడ్స్ నన్ను నటించింది. ఆ ఫేమ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

'ఈ మాయ పేరేమిటో' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వగా.. ఆ తర్వాత 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా 'ఈగల్', 'ఊరు పేరు భైరవకోన', 'డబుల్ ఇస్మార్ట్', 'విశ్వం' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తోంది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో తన లైఫ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఈ భామ సంచలన కామెంట్స్ చేసింది.
అలా 2018లో విడుదలైన ఈ మాయ పేరేమిటో సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈ క్రమంలో హిందీ, తమిళ్ లాంగ్వేజ్లలో కూడా సినిమాల్లో చేసింది. ఆ సినిమాలు కూడా విజయం సాధించడంతో తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి.
ఈ క్రమంలోనే 'ఈగల్' మూవీలో మాస్ మహా రాజ్ రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది కావ్య థాపర్. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన 'అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్ శంకర్' లో హీరోయిన్ గా నటించింది కావ్య టాపర్. ఈ మూవీలో తన అందం, అభినయంతో మెప్పించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత హీరో గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన విశ్వం మూవీలో హీరోయిన్ గా నటించింది.

ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది కావ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై కావ్య థాపర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కావ్య కాపర్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపింది. తాను నటి కావాలన్నది తన తండ్రి కల అని, ఆ కల నెరపరచుకోవడానికి తొలుత తాను మోడలింగ్ రంగంలో అడుగు పెట్టానని చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ డైరెక్టర్ తనని ఆఫీస్ కు పిలిచి.. తనకు కమిట్మెంట్ ఇస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు యాడ్స్ లో ఆఫర్ ఇస్తానని అన్నారట.
ఆ మాటలతో తాను షాక్ అయ్యానని, వెంటనే ముఖం మీద నాకు అలాంటి ఆఫర్స్ అక్కర్లేదంటూ బయటికి వచ్చానని తెలిపారు కావ్య. ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ , హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నో అవరోధాలను దాటాలని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పలు యాడ్స్లో నటించే అవకాశం వచ్చిందని, ఆ యాడ్స్ తో ఫేమ్ రావడంతో తనకు సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











