త్వరలో ఏడడుగుల వైపు.. బ్యాచిలర్‌గా లాస్ట్ వెకేషన్, శ్రీలంకలో చిల్ అవుతోన్న రవితేజ హీరోయిన్
టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. రీసెంట్‌గా చెన్నై చిన్నది మేఘా ఆకాష్ తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఏమాత్రం హాడావుడి లేకుండా ఉంగరాలు తొడిగి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు షాకిచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోనుండటంతో ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్‌గా వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది మేఘా.
2017లో నితిన్ హీరోగా వచ్చిన లై చిత్రంతో తెలుగువారిని పలకరించింది మేఘా ఆకాష్. ఆ వెంటనే చల్ మోహన రంగా, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయం ఉన్నా మేఘా ఆకాష్‌కు ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. చివరిసారిగా తెలుగులో మను చరిత్రలో నటించింది మేఘా. ఇక తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తుఫాన్ (తెలుగు)తో మరోసారి తెలుగు వారిని పలకరించింది మేఘా ఆకాష్.

మేఘా ఆకాష్ ప్రేమ, పెళ్లిపై గతంలో ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అలాంటి గాసిప్స్‌కు తెరదించాలని ఆమె డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్ధం చేసుకుంది. దీంతో సాయి విష్ణు ఎవరంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌ను గాలిస్తున్నారు. కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి సాయి విష్ణు తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకని టాక్. దాదాపు ఏడేళ్లుగా మేఘా - సాయి ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. కానీ ఇన్నేళ్లలో ఎక్కడా ఆమె ఈ విషయం బయటికి చెప్పకుండా సీక్రసి మెయింటైన్ చేసింది.
కేరళలోని ఓ ఫేమస్ స్పాట్‌లో ప్రియుడి చేతికి ఉంగరాలు తొడిగింది మేఘా ఆకాష్. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు , సన్నిహితులు ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు. నిశ్చితార్ధం తర్వాత కాబోయే భర్తను వెంట బెట్టుకుని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఇందులో ఎక్కడా పెళ్లి శుభలేఖ లేకపోయినా రజనీకాంత్‌ను ఆహ్వానించేందుకే అక్కడికి వెళ్లినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం మేఘా ఆకాష్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. త్వరలో బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు చెప్పనుండటంతో ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడే వారికి గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం ఐదుగురు తన స్నేహితులతో కలిసి ఆమె పార్టీని ఎంజాయ్ చేస్తోంది. అయితే మేఘా- సాయివిష్ణుల పెళ్లి ఎప్పుడనేది మాత్రం బయటకు తెలియరాలేదు. త్వరలోనే ఈ మేటర్‌ని అఫిషీయల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











