హీరో ధనుష్ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. నన్ను చూసి అలా ..
Dushara Vijayan: యంగ్ నటి దుషారా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'బోధై యేరి బుద్ధి మారి' అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి దుషారా విజయన్. తర్వాత సర్పత్త పరంబరై, నచ్చతిరం నగర్‌గిరదు నటించింది. ఆ తరువాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' మూవీతో స్టార్ ఫేమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇందులో హీరో ధనుష్ చెల్లెలు పాత్రలో కనిపించిన ఈ అమ్మడు. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న 'వెట్టైయాన్'లో నటిస్తుంది. ఈ మూవీ 10వ తేదీన విడుదల కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా దుషారా విజయన్ మాట్లాడుతూ హీరో ధనుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
రాయన్ వంటి చిత్రాల్లో అవకాశం దక్కించుకుని తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది నటి దుషారా విజయన్. సర్పత్త పరంబరై స్పోర్ట్ డ్రామా సినిమాలో అయితే ఈ నటి 1970ల మద్రాస్‌కు చెందిన ఒక భయంకరమైన మహిళగా నటించి తన సత్తా చాటింది. ఈ మూవీకి డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ ట్విట్టర్ లో ఈమె ఫొటో చూసి డైరెక్టర్ ఆడిషన్ కు పిలిచారు. తర్వాత 20 నిమిషాలు ఆమెతో మాట్లాడి ఈ మూవీకి ఎంపికైన్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దుషారా విజయన్ ఉత్తర చెన్నై యాసను నేర్చుకుంది. ఏకంగా ఈ మూవీలో నటనకు అయితే దుషారాకు ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు దుషారా విజయన్ నటించిన సినిమా వేట్టయాన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ క్రమంలో హీరో ధనుష్ పై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. 'ధనుష్ అంటే నాకు ఇష్టం. సినీ ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన్ను చాలా అభిమానించేదాన్ని' అని వెల్లడించింది. అలాగే వేట్టయాన్, రాయన్ మూవీ షూటింగ్స్ సేమ్ టైమ్ లో జరిగాయని తెలిపింది.తాను వేట్టయాన్ సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే ధనుష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని వెల్లడించింది. ఓసారి నా దగ్గరకు వచ్చి సూపర్ స్టార్ తో నటించావా? అని అన్నారని, దీనికి దుషారా విజయన్ అవును అని సమాధానం ఇచ్చానని పేర్కొంది. వెంటనే ధనుష్.. ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నానని అన్నారని తెలిపింది.
ఎందుకంటే ధనుషే ఇప్పటి వరకు రజనీకాంత్ తో కలిసి నటించలేదని చెప్పారని, కాగా రజనీకాంత్ అంటే ఆయనకు ఎంతలా ఇష్టమో అంటూ దుషారా విజయన్ ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు ఆ రోజే అర్థమైందని చెప్పింది. ఇక ధనుష్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎంతో అభిమానమన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలియజేశారు. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

టి. జ్ఞానవేల్ 'జై భీమ్ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో రజనీకాంత్ స్పెషలిస్టుగా నటించబోతున్నారని సమాచారం. అక్టోబరు 10 వ తేదీన విడుదలయ్యే ఈ మూవీలో అమితాబ్, రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, దుషారా విజయన్ ముఖ్యపాత్రల్లో మెరవనున్నారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరీ ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకోనుందో మరో 10 డేస్ వెయిట్ చేయాల్సిందే. రజనీకాంత్ అభిమానులు అయితే వేట్టయాన్ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











