పెళ్లైన ఆ ముగ్గురితో నగ్మా అఫైర్లు, బ్రేకప్స్.. ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు? చివరకు పెళ్లి కాకుండానే..!
తెలుగులోనే కాకుండా తమిళంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సూపర్ స్టార్స్ జతకట్టిన హీరోయిన్ నగ్మా. 90వ దశకంలో టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే సినీ తారల్లో ఒక్కరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమెతో నటింపజేయడానికి ప్రముఖ దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు. కోలీవుడ్, టాలీవుడ్ భాషల్లో దశాబ్దకాలంపాటు ఏలిన ఈ అందాల సుందరి లైఫ్ కష్టాలు, వివాదాస్పద అంశాలతో ముడిపడింది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే..
నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. తన తల్లి సీమా తన మొదటి భర్తతో విడాకులు తీసుకోని.. చందర్ సాధన అనే సినీ నిర్మాతను వివాహం చేసుకొన్నది. నగ్మాకు సినీ నటి జ్యోతిక, రోహిణి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వీరిద్దరూ కూడా తెలుగు, తమిళంలో నటించి మెప్పించారు. తండ్రి పోత్సాహం వల్లే సినిమా రంగంలోకి వచ్చారు.

ఇక నగ్మా తొలిసారి హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన భాగీ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. అదే సమయంలో సుమన్ హీరోగా పెద్దింటి అల్లుడు అనే సినిమాలో నటించడం..ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నగ్మా కెరీర్ పరంగా వెనుకకు చూసుకోలేకపోయింది. ఆ తర్వాత నాగార్జునతో కిల్లర్ సినిమాలో నటించడం ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకొన్నది.
అయితే చిరంజీవితో నటించిన ఘరానా మొగుడు సినిమా ఆమె సినీ జాతకాన్ని మార్చిపడేసింది. ఆ తర్వాత వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు, భాషా, కాదలన్, భరత సింహం, సరదా బుల్లోడు లాంటి సినిమాలతో టాప్ రేంజ్‌కు వెళ్లారు. తమిళం, తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో భోజ్‌పురి భాషలో నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించారు.
అయితే తన కెరీర్‌లో మూడుసార్లు లవ్‌లో ఫెయిల్ అయ్యారు. తొలుత అప్పటికే పెళ్లైనా క్రికెటర్ సౌరవ్ గంగూలీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వారిద్దరూ కాళహస్తిలో పూజలు కూడా చేయించుకొన్నారు. మీడియా అంతా వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకొన్నారు. కానీ అంతలోనే ఆమెతో గంగూలీ ఇన్నింగ్స్ తెరపడింది.
ఆ తర్వాత ఆ బ్రేకప్ నుంచి తేరుకొంటున్న సమయంలో తమిళ నటుడు శరత్ కుమార్‌కు సన్నిహితమయ్యారు. వారిద్దరి మధ్య కూడా జోరుగా అఫైర్ కొనసాగింది. తమిళ మీడియా అంతా.. శరత్ కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చి.. నగ్మాను పెళ్లి చేసుకోవడం తప్పదని అనుకొన్నారు. అంతలోనే నగ్మా ప్రేమ జీవితం మళ్లీ మొదటికి వచ్చింది.

తమిళంలో అవకాశాలు తగ్గడంతో భోజ్‌పురి భాషలో నటించడం మొదలుపెట్టారు. అక్కడ స్టార్ హీరో రవికిషన్‌తో వరుసగా సినిమాలు చేయడంతో వారిద్దరూ దగ్గరయ్యారు. దాంతో రవి కిషన్ వైవాహిక జీవితం కూడా సమస్యల్లో పడింది. దాంతో రవికిషన్‌తో డేటింగ్ వ్యవహారం బెడిసికొట్టింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఆమె జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నది.
సినిమాలకు దూరమైన నగ్మా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత భారతీయ జనతాపార్టీలో చేరారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయాలనుకొన్నారు. కానీ అంతలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మీరట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











