Happy Birthday Sridevi: అతిలోకసుందరి శ్రీదేవి అందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదా?

అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనాటి వ్యక్తలు నుంచి.. ఈనాటి కుర్రకారు వరకు ఆమెంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక గూగుల్ సైతం ఆమెకు ఓ స్పెషల్ డూటుల్ లోగోను రిలీజ్ చేసింది. ఇప్పుడు నెట్టింట ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అందానికి చిరునామా అనేది ఉంటే.. అది శ్రీదేవి అని అప్పట్లో తెగ అనుకునేవారు. అంతలా ఆమె అందం.. అభినయం ఉండేది. ఇక తెలుగులోనే కాదు.. సౌత్ అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుని.. తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ సైతం.. హీరోలకు మించిన క్రేజ్ ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ డం కొట్టేసింది. ఇక వరుస సినిమాలు, బోనీ కపూర్ తో ప్రేమ వివాహం, పిల్లలు.. ఇలా ఆమె జీవితం గడిచిపోయింది.

Happy Birthday Sridevi

ఇదిలా ఉంటే.. శ్రీదేవి అందం వెనుక రహస్యం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. శ్రీదేవి అంటే అందం... అంతకుమించిన నటన, నృత్యం... అయితే ఇవే ఇతర హీరోయిన్స్ కంటే ప్రత్యేకంగా ఆమెను మార్చేశాయి. కోట్లాదిమంది అభిమానులను సంపాదించి పెట్టడానికి కారణం కూడా ఆమె రూపమనే చెప్పాలి. సహజ సుందరిగా మరింత అందంగా కనిపించడానికి శ్రీదేవి ఎంతో ప్రయత్నం చేసేవారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి.

దివంగత నటి శ్రీదేవి.. అందం, ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేది అని తెలుస్తోంది. ఆమె దిన చర్యలో భాగంగా.. ఆహారం విషయానికి వస్తే.. ప్రోటీన్, కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మిశ్రమంతో కూడిన సమతుల్య ఆహారాన్ని శ్రీదేవి తీసుకునేదట. ఆమె ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడేదని తెలుస్తోంది. అంతే కాదు... అధిక జంక్ ఫుడ్, వేయించిన ఫుడ్స్ కు దూరంగా ఉండేదని సమాచారం.

Happy Birthday Sridevi:

ఇక శ్రీదేవి ఫిట్‌నెస్ విషయానికి వస్తే... శ్రీదేవి ఎక్కువగా డ్యాన్స్ చేసేదని అంటున్నారు. అది ఆమె ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుందని... ఎక్కువగా డ్యాన్స్ ను వ్యాయమం వలే చేసేదని సమాచారం. అంతే కాకుండా శ్రీదేవి యోగా, కార్డియో వ్యాయామాలు కూడా చేసేదట. ఇక ఆమె చర్మ సంరక్షణ, అందం విషయానికి వస్తే... ఆమె మచ్చలేని చర్మం కలిగి ఉండటానికి అసలు కారణం.. నేచురల్ ప్రొడక్ట్స్ ను వాడటమేనని తెలుస్తోంది. తన చర్మం దెబ్బతినకుండా.. ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేదట.

Happy Birthday Sridevi:

శ్రీదేవి కేశ సంరక్షణ విషయానికి వస్తే... శ్రీదేవి మెరిసే జుట్టుకు కారుణం... రెగ్యులర్ ఆయిల్ మసాజ్‌లు, సరైన కండిషనింగ్, మినిమల్ హీట్ స్టైలింగ్. ఇవే ఆమె జుట్టు ఆరోగ్యకరమైన జుట్టుకు, షైన్ కు దోహదపడేవని సమాచారం. ఆరోగ్యకరమైన చర్మానికి రహస్యం.. రోజంతా.. హైడ్రేటెడ్‌గా ఉండటం. తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల ఆమె చర్మం మెరిసేదని అంటున్నారు. ఇక ఆమె మానసిక స్థితికి వచ్చేసరికి... ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతమైన మనస్సును ప్రోత్సహించడంలో సహాయపడే ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను శ్రీదేవి అభ్యసించేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X