గుర్తు పట్టలేనంతగా నివేతా థామస్.. ఆ కారణం ఏమిటో తెలుసా?
సౌత్ సినిమా దగ్గర వచ్చిన ఆనతి కాలంలో ఆడియెన్స్ లో మంచి అటెన్షన్ ని పట్టుకొనే హీరోయిన్స్ తక్కువమందే ఉంటారు. అందులోని ఎలాంటి స్కిన్ షో లేకుండా ఓ కొత్త హీరోయిన్ ఆడియెన్స్ లో మంచి పేరు తెచ్చుకోవాలి అంటే అది మరింత కష్టమే అని చెప్పాలి. కానీ ఈ రకంగా కూడా డీసెంట్ క్రేజ్ ని తెలుగు సినిమా దగ్గర తెచ్చుకున్న హీరోయిన్స్ లేకపోలేరు. కాగా అలాంటి యంగ్ హీరోయిన్స్ నాని బ్యూటీ నివేతా థామస్ కూడా ఒకామె అని చెప్పాలి.
అయితే నివేత థామస్ తెలుగు ఆడియెన్స్ కి 2016 నుంచే తెలుసు కానీ సినీ పరిశ్రమలోకి ఈమె 2008 లోనే అడుగు పెట్టింది. మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి నాచురల్ స్టార్ నానితో ఎక్కువ సినిమాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ సినిమాల్లో కూడా స్క్రీన్ ని షేర్ చేస్కునే అవకాశాన్ని నివేతా థామస్ దక్కించుకుంది.

ఇప్పుడు హీరోయిన్ గా సెటిల్ అయ్యి పలు చిత్రాలు చేస్తుంది. అయితే నివేత థామస్ అందానికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మిగతా హీరోయిన్స్ లా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా కూడా తన నటన, లుక్స్ తో నివేత ఆకట్టుకుంటుంది. అయితే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఎదుర్కొనే రేర్ సమస్యనే ఇప్పుడు నివేత ఎదుర్కొంటుంది అని చెప్పాలి.
ఇన్ని రోజులు కొంచెం హైట్ తక్కువ అయినా కూడా నివేత ఫిట్ గా కనిపించేది కానీ లేటెస్ట్ గా ఊహించని మేకోవర్ లోకి మారిన నివేతా ని చూసి ఇపుడు అభిమానులు నెటిజన్స్ సైతం షాకవుతున్నారు. ఇన్నిరోజులు చూసిన నివేత వేరు ఇప్పుడు కనిపిస్తున్న నివేత వేరు అన్నట్టుగా చాలా లావుగా మారిపోయి అందరికీ షాకిచ్చింది. ఈమె నటించిన తాజాగా చిత్రం "35 చిన్న కథ కాదు" రిలీజ్ కి వస్తుంది.

ఈ షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తయ్యిపోయింది. ఈ ఆగష్టు 15 రేస్ లోనే రిలీజ్ రావాల్సిన చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. కాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా చాలా కాలం తర్వాత నివేత బయట దర్శనం ఇచ్చింది. ఇలా ఇవ్వడం తోనే తన ఊహించని లుక్ తో అందరికీ షాకిచ్చింది. అప్పటికి ఇప్పుడు చాలా బరువు పెరిగిపోయి తన వయసుకి మించిన వ్యక్తిలా కనిపిస్తుంది. అందుకు కారణం హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెబుతున్నారు.
దీనితో అప్పుడు అలా ఉండే నివేత ఇప్పుడేంటి ఇంత దారుణంగా మారిపోయింది అని నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నివేతా నుంచి ఊహించని షాకే అని చెప్పాలి. హార్మోనల్ సమస్యనా? లేదా ఏదన్నా సినిమా కోసం ఆమె ఇలా మారిందా లేక సినిమాలే లేక ఇలా మారిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నివేత ఈ ఒక్క సినిమా 35 చిన్న కథ కాదు తో మాత్రమే థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రాన్ని రానా నిర్మాణం వహించగా ప్రియదర్శి హీరోగా నటించాడు. అలాగే నంద కిషోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











