బాలకృష్ణతో అందుకే నటించలేదు.. ఆ సినిమా తర్వాత.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా పరిశ్రమలో సాధారణ యాక్టర్‌గా ప్రవేశించిన విజయశాంతి.. మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌‌గా ఎదిగారు. కేవలం స్టార్ హీరోయిన్‌గానే కాకుండా లేడీ అమితాబ్ బచ్చన్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే తన సినిమా ప్రయాణంలో చాలా మంది అగ్రహీరోలతో కలిసి నటించారు. అయితే బాలకృష్ణతో ఓ సినిమా తర్వాత ఎందుకు నటించలేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణతో విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించారు. వారితో ఆమె నటించిన చిత్రాలన్నీ భారీ విజయాలు అందుకొన్నాయి. అయితే నిప్పురవ్వ అనే సినిమా తర్వాత ఆమె బాలకృష్ణతో నటించలేదు. ఆ విషయంపై మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటికి వారి మౌసమే చాలా ఏళ్లుగా సమాధానంగా నిలిచింది.

Reason Behind Vijayashanti away from Nandamuri Balakrishna Movies after Nippuravva

అయితే నిప్పురవ్వ సినిమా వరకు బాలకృష్ణతో కలిసి నటించాం. అయితే ఆ సినిమాకు ముందు, తర్వాత నేను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా మారిపోయాను. అయితే నేను హీరో స్థాయి క్యారెక్టర్లను పోషిస్తూ ఉండటం బాలయ్యతోపాటు నటించకపోవడానికి ప్రధాన కారణం. ఆయన పక్కన నాకు నటించేందుకు సరిపోయే పాత్ర ఉండాలి. అలాంటి పాత్రలు రానందునే ఆయన పక్కన నటించలేదు అని అన్నారు.

నేను హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినప్పటికీ.. చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు చిత్రాల్లో నటించాను. కానీ బాలయ్య పక్కన నటిస్తే.. ఆ స్థాయి పాత్ర నా ముందుకు రాకపోవడం వల్ల బాలయ్యతో నటించలేదు. దానికి వెనుక ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. బాలయ్యతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని విజయశాంతి అన్నారు.

తన కెరీర్‌లో బాలయ్యతో నటించిన సినిమాలు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షూటింగులో నన్ను చాలా బాగా చూసుకొనే వాళ్లు. ఇప్పటికీ మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ నిరాధారమే అని ఆమె చెప్పారు. మంచి పాత్రలే రాకపోవడం వల్ల ఆయనతో నటించే అవకాశం రాలేదు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X