ఏ పెళ్లికి పడితే ఆ పెళ్లికి వెళ్లను...అనంత్ అంబానీ మ్యారేజ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ఎట్టకేలకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల వివాహ మహోత్సవ వేడుక ముగిసింది. కన్నుల పండుగ జరిగిన ఈ వివాహ వేడుకను నిర్వచించడానికి గ్రాండ్ అనే పదం సరిపోదనే చెప్పాలి. అలాంటి పెళ్ళిలో గెస్ట్ గా మెరవాలని ఎవరికి ఉండదు చెప్పండి? పైగా అంబానీల పెళ్ళికి ఆహ్వానం అందడం అనేది స్పెషల్ స్టేటస్ లాంటిది. కానీ ఈ పెళ్లిలో కన్పించని తాప్సీ తాజాగా వివాస్పద వ్యాఖ్యలు చేసింది. మరి తాప్సీ అసలు అంబానీ పెళ్లి గురించి ఎలాంటి కామెంట్స్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి.
మార్చి నుంచి మొదలైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూలైలో వారం రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలతో ముగిసింది. ఆకాశమంత పందిరి భూదేవి అంత పీఠం వేసి ముఖేష్ అంబానీ జరిపిన తన కొడుకు అనంత్ అంబానీ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులతో పాటు ఎక్కడ చూసినా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు దర్శనమిచ్చారు.. సౌత్ నుంచి కొంతమంది స్టార్ హీరోలు ఈ వేడుకకు అటెండ్ కాగా, దేశ విదేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా విచ్చేశారు.

అంబానీ కుటుంబం ఈ పెళ్లి కోసమే ఏకంగా 5000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ వివాహానికి బాలీవుడ్ మొత్తం కదలి వచ్చింది. కానీ కొంతమంది మాత్రం పెళ్లిని మిస్ చేశారు. అందులో మిల్కీ బ్యూటీ తాప్సి కూడా ఒకరు. దీంతో తాప్సి ఈ పెళ్లికి ఎందుకు హాజరు అవ్వలేదు అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రీసెంట్ గా ఆమె అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఏ పెళ్లికి పడితే ఆ పెళ్ళికి వెళ్లలేను అన్నట్టుగా తాప్సి మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాప్సి అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా వాళ్ల గురించి తెలియదు. వివాహాలు అనేవి చాలా వ్యక్తిగతమైనవని నేను భావిస్తున్నాను. వాళ్ళ స్నేహితులు చాలా మంది ఉన్నారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ కుటుంబం, అతిధి మధ్య కనీసం ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ ఉండే వివాహానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటూ కుండబద్దలు కొట్టింది.

అంటే ఆ పెళ్లికి వెళ్లినప్పటికీ కనీసం వాళ్లు అతిధులుగా కూడా చూడరు, పలకరించరు అన్న విధంగా తాప్సి కామెంట్స్ చేసింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారని టాక్ నడిచింది. ఇప్పుడేమో తాప్సి ఈ రకంగా బాంబ్ పేల్చింది. కానీ చాలామంది సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి ఆహ్వానం రావడాన్ని ఓ పెద్ద స్టేటస్ గా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అనంత్ అంబానీ అతిథి జాబితాలో కిమ్ కర్దాషియాన్, ఖ్లో కర్దాషియాన్, రెమా, జాన్ సెనా, లూయిస్ ఫోన్సీ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, రామ్ చరణ్ దంపతులు, పవన్ కళ్యాణ్ వంటి సౌత్, నార్త్ స్టార్స్ పేర్లు ఉన్నాయి. కాగా ఈ ఈవెంట్‌కు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, తాప్సీ తదితరులు డుమ్మా కొట్టారు.


Click it and Unblock the Notifications











