Bigg Boss Telugu 7 షకీలాను ఆర్థికంగా మోసం చేసిందెవరు? సీనియర్ యాక్టర్‌ను తొక్కేసిన హీరోలెవరంటే?
అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఈ షోను లాంచ్ చేశారు. ఉల్టా పుల్టా అంటూ షోను సరికొత్తగా ప్రారంంభించడం కొంత కొత్తగా అనిపించింది. అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో 6వ కంటెస్టెంట్‌గా సీనియర్ నటి షకీలా ఇంటిలోకి అడుగుపెట్టింది. ఆమె తన ప్రోమోలో చెప్పిన విషయాలు ఏమిటంటే?
నా పేరు సీ షకీలా జాన్. మా అమ్మది నెల్లూరు, మా నాన్నది చెన్నై. నేను 10వ తరగతి ఫెయిల్ కావడంతో మా నాన్న విపరీతంగా కొట్టాడు. అలాంటి సమయంలో ఓ మేకప్ మ్యాన్ వచ్చి.. ఈమెను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత చెన్నైలోని స్టూడియోలోకి వెళితే అక్కడ నన్ను చూసి సిల్క్ స్మిత చెల్లెలుగా యాక్ట్ చేయమని చెప్పారు. అలా నా సినిమా కెరీర్ ప్రారంభమైంది అని షకీలా చెప్పింది.

మా నాన్న చనిపోయిన తర్వాత మలయాళ సినిమా ఇండస్ట్రీలో హాట్ రోల్స్‌ను ఒప్పుకోవడం చేశాను. ఆ సమయంలో నాకు విపరీతంగా డబ్బు వచ్చింది. ప్రతీ శుక్రవారం ఒక సినిమా నాది రిలీజ్ అయ్యేది. నా ఇంట్లో డబ్బు మూటల కట్టి అటక మీద ఉండేది. అలా ఉంటే ఇన్‌కమ్ టాక్స్ వాళ్లు వచ్చి రైడ్ చేస్తారని మా సిస్టర్ ఎత్తుకెళ్లింది. ఇప్పుడు మా అక్క చాలా సంతోషంగా ఉంది అని షకీలా ఎమోషనల్ అయింది.
మలయాళంలో నా సినిమాలకు భారీగా రెస్సాన్ రావడంతో కొందరు హీరోలు నా సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. నాపై కక్ష కట్టింది ఎవరో నాకు తెలుసు. అలాంటి సమయంలో నేను దాదాపు నాలుగేళ్లు యాక్టింగ్‌కు దూరంగా ఉన్నాను. అప్పుడు నాకు ఎవరూ కూడా ఆఫర్లు ఇవ్వలేదు. ఆ పరిస్థితుల్లో దేవుడిలా డైరెక్టర్ తేజ వచ్చి నా కెరీర్‌ను మార్చి వేశాడు అని షకీలా చెప్పింది.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న షకీలాకు తెలుగులో హుందాగా ఉండే రోల్‌ను డైరెక్టర్ తేజ తన నిర్మించిన నువ్వు నేను సినిమాలో ఇచ్చారు. దాంతో ఆమె రెండో ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత షకీలా కొన్ని మంచి పాత్రలు చేయడం మొదలుపెట్టింది. అలా మళ్లీ ఆమె కెరీర్ గాడిన పడేందుకు తేజ చేయూత నిచ్చారు. నా కెరీర్ ఒక వేవ్‌లా వచ్చింది. అన్నింటికి మించి నేను నాలా ఉండటమే నాకు కావాల్సింది అని షకీలా చెప్పింది.
ఇక అసలు విషయానికి వస్తే.. మలయాళంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలతో షకీలా సంచలనం రేపింది. దాంతో అప్పట్లో సూపర్ స్టార్ హీరోలు సురేష్ గోపి, మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్ లాంటి వాళ్లు షకీలా సినిమాలు బ్యాన్ చేయాలని సమ్మె చేశారని వార్తలు మీడియాలో వచ్చాయి. సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసి ఆమె సినిమాల సెన్సార్‌ను అడ్డుకొన్నారు. దాంతో షకీలా ఒత్తిడికి గురై సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











