నాని జెర్సీకి హీరోయిన్ ఖరారైనట్లేనా!
నేచురల్ స్టార్ నాని అటు బిగ్ బాస్ సీజన్ 2 ఇటు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. బిగ్ బాస్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే నాగార్జునతో మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో నాని నటించబోయే జెర్సీ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ రెబ్బ మోనికా జాన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె వలన సినిమాకు ఫ్రెష్ లుక్ వస్తుందని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి భావిస్తున్నాడు.

ఇటీవల రెబ్బా మోనికని కలసి కథ వినిపించాడట. ఆమె పాజిటివ్ గా స్పదించినట్లు తెలుసస్తోంది. దాదాపుగా రెబ్బా మోనిక ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో నాని మల్టిపుల్ రోల్స్ లో కనిపిస్తాడట.


Click it and Unblock the Notifications











