ఎవరు దర్శకుడిపై రెజీనా షాకింగ్ కామెంట్.. ఏమన్నారంటే

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్‌పై పర్ల్ వీ పొట్లూరి, పరమ్ వీ పొట్లూరి నిర్మాతలుగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎవరు. అడివి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కసండ్రా, మురళీ శర్మ నటించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్నది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న హీరోయిన్ రెజీనా కసండ్రా తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.

ఎవరు సినిమా కోసం వెంకట్ రాంజీ నూతన దర్శకుడిగా మారారు. ఆయన కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకొన్నది. నాకు ఉన్న అనుభవాన్ని బట్టి ఓ దర్శకుడిని నమ్మాలంటే నాకు రెండు గంటలు చాలు. అతడు నాకు కథ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. అంతేకాకుండా కథ చెప్పిన తీరే కాకుండా సెట్లో కూడా నాకు బలమైన నమ్మకం కలిగించాడు.

Regina Cassandra about Director Venkat Ramji

వెంకట్ రాంజీ నెమ్మదస్తుడు. సెట్లో చాలా కామ్‌గా ఉంటాడు. రాఘవేంద్ర రావు, లాంటి అగ్రదర్శకుల వద్ద పనిచేశాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా విభాగాలపై చాలా మంచి పట్టు ఉంది. సెట్లో ఎంత కోపం వచ్చిన ఒక్కసారిగా గొంతు చించుకు అరవలేదు. ఆయనతో మాట్లాడించాలని మేము కావాలని ఆయనను టీజ్ చేసే వాళ్లం. అయినా ఆయన ఒక్కసారి కూడా టెంప్ట్ కాలేదు.

సీన్ గురించి ఏమైనా కంప్లయింట్ చేయమని చెప్పినా తొణుకు బెణుకు లేకుండా ఉండేవారు. నటీనటులు నుంచి ఏం రాబట్టుకోవాలో అతనికి బాగా తెలుసు. అతడు తొలి చిత్ర దర్శకుడు అంటే ఎవరూ నమ్మరు. అనుభవం ఉన్న దర్శకుడిగా సెట్లో కనిపించే వాడు తమన్నా అన్నారు. అలాగే ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో ఆయనకు ఎంత సహనం ఉండేదంటే.. నాతో 70 గంటలపాటు డబ్బింగ్ చెప్పించారు. తెలుగులో ఒక్క తప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X