‘ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’

నటీనటుల వ్యక్తిగత జీవితాలలో ఎన్నో బాధలు, కన్నీళ్లు, విషాదాలు ఉంటాయి. అయినప్పటికీ అన్నింటినీ లోపల దాచుకుని నవ్వుతూ తిరుగుతారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒక్కో సెలబ్రిటీదీ ఒక్కో బాధ. ఇంటర్వ్యూలు, ఇతర సందర్భాలలో నటీనటులు బయటపడుతుంటారు. తాజాగా హీరోయిన్ రెజీనా కాసాండ్రా తన రిలేషన్, ప్రేమ జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
సూపర్‌స్టార్ ఇంటికి కోడలిగా అక్కినేని హీరోయిన్? దిమ్మతిరిగేలా నటి తల్లి కౌంటర్
సూపర్‌స్టార్ ఇంటికి కోడలిగా అక్కినేని హీరోయిన్? దిమ్మతిరిగేలా నటి తల్లి కౌంటర్

సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌ చాలా పెద్దది. 60 ఏళ్లు వచ్చినా పెళ్లికానీ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రభాస్, అనుష్క శెట్టి, కంగనా రనౌత్, త్రిషా కృష్ణన్ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఈ కోలోకే వస్తారు సినీ నటి రెజీనా కసాండ్రా. కండనాల్ ముదల్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు వారిని పలకరించారు. ఆ తర్వాత రోటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవన్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య, జో అచ్యుతానంద, శంకర, మా నగరం, నక్షత్రం తదితర చిత్రాలలో నటించింది. వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ రెజీనాకు స్టార్‌డమ్ దక్కలేదు.

Regina Cassandra Gets Emotional About Love Life Shares Deep Thoughts on Relationships

గ్లామర్ షోకు ఓకే చెప్పినా, ఎలాంటి సీన్లు చేసినా రెజీనాకు అవకాశాలు మాత్రం దక్కలేదు. తెలుగులో అదృష్టం కలిసిరాకపోవడంతో హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. అక్కడా అదే పరిస్ధితి ఎదురైంది. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2, ఫ్లాష్‌బ్యాక్‌తో పాటు హిందీలో సెక్షన్ 108 సినిమాలలో నటిస్తున్నారు రెజీనా. నటిగా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న కొందరిలో ఒకరిగా రెజీనా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆమె నట జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేం రాలేదు. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ దుమ్మురేపారు రెజీనా. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ నటించిన ఆచార్యలో సానా కష్టం అంటూ ఏకంగా చిరుతో స్టెప్పులు వేశారు రెజీనా.

Recommended For You
'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’
'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’

అందరు హీరోయిన్ల మాదిరిగానే రెజీనాపైనే ఎన్నో గాసిప్స్ వచ్చాయి. సందీప్ కిషన్, సాయి దుర్గాతేజ్‌లతో రెజీనా డేటింగ్ చేస్తున్నట్లు పలుమార్లు పుకార్లు వచ్చాయి.. తర్వాత ఇవి గాలి వార్తలుగా మిగిలిపోయాయి. సందీప్, సాయి ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. తన జీవితంలో పలువురితో రిలేషన్‌లో ఉన్నానని.. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసునని వ్యాఖ్యానించింది. నా పెళ్లి గురించి నా పేరెంట్స్‌కే లేని బాధ మీకెందుకు అంటూ పలుమార్లు నెటిజన్లకు గడ్డి పెట్టింది.

You May Also Like
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రేమ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెజీనా కాసాండ్రా. ఒకరోజు నన్ను నేను ప్రేమకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను. పరిస్థితులను వాటి మానాన వాటిని వదిలేయడాన్ని చాలామంది నిస్సహాయతగా పొరబడుతుంటారు-కానీ ప్రేమ అనేది ఒక నిశ్శబ్ద శక్తి. చిరునవ్వుతో మీ కోసం మీరు నిలబడటానికి, అలాగే మీరు ప్రేమించబడటానికి అర్హులని గుర్తుంచుకోవడానికి ప్రతి రోజూ ఒక మంచి రోజే. ఈ విషయాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. ప్రేమించడం, ప్రేమించబడటంలోనే ఆనందం ఉందంటే, దాన్ని కోల్పోయే బాధ మనకు తెలుసు కాబట్టే. కృతజ్ఞత అన్నింటినీ మార్చేస్తుందని చాలామంది చెప్పారు, అది నిజమే. కృతజ్ఞత అనే దృష్టితో ప్రపంచాన్ని చూసినప్పుడు, ఆ అనుభూతి భిన్నంగా ఉంటుంది. గతంలో నా కృతజ్ఞతా దృష్టితో చూసిన కొన్ని జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి అంటూ రెజీనా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రెజీనా ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: regina cassandra movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X