బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన రెజీనా.. సెన్సార్ అధికారులకే చెమటలు పట్టించేలా!
గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న రెజీనా కసండ్రాకు ఓ దశలో వరుస అపజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత తన కెరీర్‌ను చక్కదిద్దుకొనేందుకు ప్లాన్ చేసుకొన్నది. తాను అంగీకరించే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సరైన పాత్రలను ఎంపిక చేసుకొంటూ ముందుకెళ్తున్నది. అయితే బోల్డ్ పాత్రలను అవలీలగా పోషిస్తూ అటు నిర్మాతలను, అభిమానులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో రెజీనా చేసిన తాజా సినిమాలో హాట్ సీన్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ సీన్లు, ఆ సినిమా ఏమిటంటే..

బోల్డ్ పాత్రలతో మరింత హాట్‌గా
గత కొద్దికాలంగా పాటలకు, కొన్ని సీన్లకు పరిమితమయ్యే పాత్రలను రెజీనా ఎలాంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తున్నారనే విషయం సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఆహా నుంచి మొదలైన బోల్డ్ పాత్రల వ్యవహారం అలానే కొనసాగుతున్నది. ఇప్పుడు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న శృంగారతారగా రెజీనా విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొంటున్నారు.

ఎవరులో అందం, అభినయంతో
ఇటీవల తెలుగులో రిలీజైన ఎవరు సినిమాలో కూడా ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ సీన్లతోపాటు పెర్మార్మెన్స్‌తో కూడా ఇరుగదీసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రెజీనా ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా అనే సినిమాలో లెస్బియన్‌గా నటించింది. ఆ సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ.. మంచి మార్కులనే కొట్టేసింది.

చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో
ఇక చిరంజీవితో కలిసి ఆచార్యలో స్పెషల్ సాంగ్‌లో రెజీనా అందాల ఆరబోశారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆచార్యలో ఓ ప్రత్యేక పాటలో చిరంజీవితో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని చెప్పారు. చిరంజీవి లాంటి హీరోతో డ్యాన్స్ చేయడమంటే మామూలు విషయం కాదనే విషయాన్ని వెల్లడించింది.

కుర్ర హీరోతో కలిసి బోల్డుగా
ఇక తాజాగా రెజీనా ఓ కుర్ర హీరోతో కలిసి చిత్రంలో బోల్డ్‌గా నటించారనే వార్త వైరల్ అవుతున్నది. ఇంకా పేరు పెట్టని చిత్రంలో రెజీనా నటించిన బోల్డ్ సీన్లు సెన్సార్ బోర్డు అధికారులకు దిమ్మతిరిగేలా చేశారని ఇండస్ట్రీలో టాక్. కొత్తగా పరిశ్రమకు పరిచయం అవుతున్ హీరోతో ఓ రేంజ్ బోల్డు సీన్లు చేయగా.. వాటికి సెన్సార్ భారీగా కత్తెర్లు వేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా కోసం రెజీనా భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం.
Recommended Video

రెజీనా కెరీర్ జోరుగా
ఇక రెజీనా కెరీర్ విషయానికి వస్తే.. 2020 నేంజమ్ మర్పాతిళ్, పార్టీ, చక్ర, కల్లపార్ట్, కసడా తప్పరా అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా ఆచార్య చిత్రంలో గెస్టుగా కనిపిస్తున్నారు. అయితే 2020లో విజృంభిద్దామని అనుకొన్న రెజీనాకు కరోనా పరిస్థితులు అడ్డు తగిలాయి. కాకపోతే భారీగా ప్రాజెక్టులు రెజీనా చేతిలో ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











