నాకు అలాంటి మగాడు కావాలి.. రిలేషన్‌పై రెజీనా బోల్డ్‌ కామెంట్స్

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే చాలా మంది ఉంటారు. వీరిలో హీరోయిన్ల కేటగిరీలో అనుష్క శెట్టి, త్రిష, అంజలి, కృతిసనన్ ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు లిస్ట్ పెద్దదే. ఈ కోవలోకే వస్తారు రెజీనా కాసాండ్రా. కోలీవుడ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 30 క్రాస్ చేసిన రెజీనా ఇప్పటికీ బ్యాచిలర్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్, రిలేషన్, కాబోయే వాడు ఎలా ఉండాలి అన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు రెజీనా. ఆ తర్వాత రోటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవన్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య, జో అచ్యుతానంద, శంకర, మా నగరం, నక్షత్రం తదితర చిత్రాలలో నటించింది. తెలుగుతో పాటు మధ్యలో హిందీ, తమిళ్, కన్నడ సినిమాలలో రెజీనా నటించారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావొస్తున్నా ఆమె స్టార్ డమ్ అందుకోలేకపోయారు. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ దుమ్మురేపారు రెజీనా.

Regina Cassandra Opens Up About Breakup Relationships and Her Future Partner Expectations

అందరు హీరోయిన్ల మాదిరిగానే రెజీనాపైనా కెరీర్ తొలినాళ్ల నుంచి నేటి వరకు ఎన్నో గాసిప్స్ వచ్చాయి. ముఖ్యంగా సందీప్ కిషన్, సాయి దుర్గాతేజ్‌లతో రెజీనా రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిపై పలుమార్లు రెజీనా స్పందించింది. సందీప్, సాయి ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. తన జీవితంలో పలువురితో రిలేషన్‌లో ఉన్నానని.. తాను సీరియల్ డేటర్‌నని బోల్డ్ కామెంట్స్ చేసింది రెజీనా. అంతేకాదు.. మగాళ్లు మ్యాగీలు రెండు నిమిషాలే అంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రస్తుతం తమిళంలో ఫ్లాష్‌బ్యాక్, మూకుతి అమ్మన్ 2.. హిందీలో ది వైవ్స్, సెక్షన్ 108 అనే సినిమాలలో రెజీనా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ తెలుగు యూట్యూట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు రెజీనా.

రూమర్స్‌ని నేను ఏ మాత్రం పట్టించుకోను.. పిచ్చ లైట్. కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితులకు ఎఫెక్ట్ అవుతుందంటే ఇరిటేట్ అవుతా. ఎందుకంటే నేనేం చేయలేను కాబట్టి. 2020లో నాకు బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ప్రేమలో పడేంత టైం, మైండ్ స్పేస్ నాకు దొరకలేదు. బ్రేకప్ తర్వాత చాలా నేర్చుకున్నా. ఈ సమయంలో ఎవరికీ స్పేస్ ఇవ్వాలని అనుకోలేదు. నేనొక డిటాచడ్ పర్సన్‌ని.. ఇప్పటి వరకు చూసిన అనుభవాలు నన్ను అలా మార్చేశాయి. రిలేషన్‌షిప్‌కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా.. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ అందరినీ చాలా బాగా చూసుకుంటా. చాలా చిన్న వయసులోనే ఇండిపెండెంట్‌గా బతకాల్సి వచ్చింది. నా జీవితంలో ఎవరైనా ఉన్నాసరే, లేకపోయినా సరే పెద్దగా తేడా ఉండదని రెజీనా అన్నారు.

మా అమ్మ సింగిల్ మదర్‌గానే నన్ను పెంచారు. అర్ధరాత్రి పూట ఏదైనా అవసరం వస్తే ఎవరో ఒక ఫ్రెండ్‌కి నేను కాల్ చేస్తాను. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం నాతో నేనే డేట్ చేస్తున్నా.. జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు. నా జీవితంలో ఎవరూ లేనప్పుడు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ మ్యారేజ్ టాపిక్ ఎత్తాలంటే ఎవరైనా ఉండాలి కదా? కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఐడియా, రిస్ట్రక్షన్స్ లేవు. మానసికంగా బలంగా ఉంటే చాలు. తనకు ఆల్పామేల్ టైప్ మగాడు కావాలి అని రెజీనా కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: regina cassandra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X