బాలీవుడ్ నిజస్వరూపం అదే.. అలాంటి చిన్నచూపు.. రెజీనా కసాండ్రా బట్టబయలు!

తెలుగు ప్రేక్షకులకు రెజీనా క‌స్సాండ్రా (Regina Cassandra)గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. వెండితెరపై తన సహజమైన అందం, స్టైలిష్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నది. ఈ భామ 2005లో సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటిస్తూ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తన సత్తా చూపించింది. పలు స్టార్ హీరోల సరసన కీలక పాత్రలు చేసినప్పటికీ... ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం రెజీనాకు దక్కలేదు. ముఖ్యంగా తెలుగులో ఒక దశ తర్వాత ఆఫర్లు తగ్గిపోవడంతో ఆమె ఫోకస్ ఇతర భాషలపై పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే. .?

తాజాగా హీరోయిన్ రెజీనా క‌స్సాండ్రా బాలీవుడ్‌లో ఎదురైన చేదు అనుభవాలపై ఓపెన్ అయ్యారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... హిందీ చిత్ర పరిశ్రమలో తనను కేవలం 'సౌత్ నుంచి వచ్చిన నటి'గా చూడడమే కాకుండా, మాటలతో పాటు ప్రవర్తనలోనూ చిన్నచూపు చూపిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన ప్రయాణం అంత ఈజీగా సాగలేదని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

Regina Cassandra Opens Up on Bollywood Discrimination Treated Like an Outsider Despite Talent

రెజీనా 2019లో విడుదలైన ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా ( Ek Ladki Ko Dekha Toh Aisa Laga) సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సాధారణంగా దక్షిణాది నటీనటులకు హిందీ రాదనే అపోహ ఉంటుంది. కానీ రెజీనా విషయంలో అది పూర్తిగా తప్పు. ఆమెకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం అనర్గళంగా వచ్చు. అంతేకాదు... తాను చేసిన ప్రతి హిందీ ప్రాజెక్ట్‌కు స్వయంగా తన గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నానని, ఎక్కడా డబ్బింగ్ ఆర్టిస్టులను వాడలేదని ఆమె గర్వంగా చెప్పారు. అయినా 'బయటివాళ్లలా' చూసిన సందర్భాలు ఎదురయ్యాయని రెజీనా వెల్లడించింది.

బాలీవుడ్‌లో కొందరు వ్యక్తులు మాటలతోనే కాదు... తమ ప్రవర్తనతో కూడా తనను చిన్నచూపు చూసినట్లు ఆమె చెప్పింది. ముఖ్యంగా తాను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చానన్న కారణంతోనే కొన్ని సందర్భాల్లో అవమానంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. 'బాలీవుడ్ లో పని చేయబోతున్నానన్నప్పుడు కొంత భయం సహజంగానే ఉంది. కానీ అక్కడ ఎదురైన కొన్ని అనుభవాలు నిజంగా బాధించాయి,' అని రెజీనా చెప్పుకొచ్చింది.

అయితే అన్ని అనుభవాలు నెగెటివ్ కాదని కూడా ఆమె స్పష్టం చేసింది. కొంతమంది దర్శకులు, సహ నటులు ఎంతో గౌరవంగా మెలిగి, ప్రొఫెషనల్ వాతావరణం కల్పించారని పేర్కొంది. 'మంచి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ల వల్లే ఆ కష్టమైన దశను దాటగలిగాను,' అంటూ పాజిటివ్ కోణాన్ని కూడా గుర్తు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లే నటీనటులు ఎదుర్కొనే సమస్యలపై ఇప్పటికే పలువురు మాట్లాడినప్పటికీ... రెజీనా తాజా వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలోని అంతర్గత వివక్షపై చర్చకు దారితీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X