Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ప్రెగ్నెంట్ అని చెప్పి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ రెజీనా మోసం.. ఏం జరిగిందంటే?
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్ర గ్లామరస్ ఫోటోలతో కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్యూట్ హీరోయిన్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న విధానం కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతుంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఆమె ఎవరు ఊహించని విధంగా ఒకసారి గర్భవతి అని అబద్ధం చెప్పాల్సి వచ్చినట్లుగా వివరణ ఇచ్చింది. అలా రెజీనా మోసపూరితంగా ఎందుకు అబద్దం చెప్పాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు
తమిళనాడుకు చెందిన రెజీనా మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె నటించాలని బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో మళ్లీ సౌత్ ఇండియా లోనే సినిమాలు చేసింది ఇక మొదట ఆమె 2005లోనే ఒక తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది.

చిన్న సినిమాలతోనే గుర్తింపు
రెజీనా
తెలుగులో
2012లో
సుధీర్
బాబు
మొదటి
సినిమాలో
హీరోయిన్
గా
కనిపించింది.
శివ
మనసులో
శృతి
అనే
ఆ
సినిమా
అప్పట్లో
బాగానే
క్రేజ్
అందుకుంది.
అనంతరం
వెంటనే
రొటీన్
లవ్
స్టోరీ
అనే
మరొక
సినిమా
చేసిన
రెజినాకు
కమర్షియల్
గా
మంచి
విజయం
దక్కింది.
ఆ
తరహాలోనే
తమిళ్
తెలుగులో
ఆమె
మొదట్లో
కొన్ని
చిన్న
సినిమాలతోనే
మంచి
గుర్తింపు
అయితే
అందుకుంది.

ఒక్క సినిమా సక్సెస్ అయితే..
రెజీనా మిగిలిన హీరోయిన్స్ కంటే కాస్త విభిన్నంగా నటిస్తూ తన నవ్వుతోనే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ ఓవర్గం మీడియం రేంజ్ హీరోలతో బాగానే సినిమాలు చేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్ సక్సెస్ ఆయిన తరువాత అప్పట్లో అయితే ఒకేసారి ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఈ బ్యూటీకి అప్పట్లో అయితే ఒకేసారి పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చేవి. కానీ అందులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది.

హారర్ వెబ్ సీరీస్
అయితే రెజినా చేసిన కొన్ని ప్రయత్నాలు ప్రయోగాత్మక సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల ఆమె మొదటిసారి ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తూ ఒక హారర్ వెబ్ సీరీస్ లో నటించింది. ఆ సీరీస్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. అన్యస్ ట్యుటోరియల్ అనే ఆ సినిమాలో రెజీనా అద్బుతం గా నటించినట్లు ఇండస్ట్రీలో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

గర్భవతి అంటూ..
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రెజీనా ఎవరు ఊహించని ఒక విషయాన్ని తెలియజేసింది. రియల్ లైఫ్ లో ఒకసారి తన అవసరం కోసం గర్భవతి అని ఒక వ్యక్తికి అబద్ధం చెప్పేసిందట. అసలు ఏం జరిగిందంటే రెజినాకు మిష్టి దోయ్ అనే స్వీట్ అంటే ఎంతో ఇష్టమట. ఇక ఆ స్వీట్ తినాలని ఆమె ఒక రాత్రి స్వీట్ షాప్ దగ్గరకు వెళ్లిందట. ఇక అప్పుడే అతను ఆ స్వీట్ షాపును మూసివేసే క్రమంలో చాలాసేపు రెజినా బ్రతిమాలుకుందట. ఇక తర్వాత తాను ప్రెగ్నెంట్ అని అలాంటి స్వీట్ తినాలని అనిపిస్తుంది అని చెప్పగానే అతడు జాలితో మళ్ళీ షాపును తెరిచి కావలసిన స్వీట్ ని ఇచ్చినట్లుగా రెజీనా తెలియజేసింది. ప్రస్తుతం రెజీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.