పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ఆ కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయా..
దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రెజీనా కాసండ్రా (Regina Cassandra). అందం,అభినయం, స్టైల్ అన్ని కలసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా చేసిన ఓ సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన జీవితంలో ఒక సందర్భంలో తాను గర్భవతి (pregnant) అని అబద్ధం చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంఘటన వెనుక ఉన్న కారణం ఏమిటి? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అనే వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసండ్రా మరోసారి వార్తల్లో నిలిచింది. 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా, ఆ తర్వాత భాషా భేదం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. తర్వాత ఆమె 'రొటీన్ లవ్ స్టోరీ'తో మరింత ఫేమ్ సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ రెండింట్లోనూ వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇటీవల "విదాముయార్చి" (తమిళం), "జాట్" (హిందీ), "కేసరి చాప్టర్ 2" (హిందీ) వంటి సినిమాలలో నటించి తన నటనతో మెప్పించింది. ఇలా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ బ్యూటీ.

ఇటీవల ప్రముఖ నటుడు, యాంకర్, కమెడియన్ ఆలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' అనే కార్యక్రమంలో రెజీనా పాల్గొంది. ఈ షోలో ఆమె తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, కెరీర్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి సరదాగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ఓ ప్రశ్నకు రెజీనా ఇచ్చిన సమాధానం ప్రేక్షకులను నవ్వులు పూయించింది. "రాత్రి 12 గంటలకు బెంగళూరులో స్వీట్ తినాలనే కోరిక ఎందుకు వచ్చింది? అంత ప్రత్యేకమైన స్వీట్ ఏంటి?" అని ఆలీ అడగ్గా, ఆమె చెప్పిన కథ ఇప్పుడు వైరల్‌గా మారింది.
రెజీనా చెప్పిన ప్రకారం.. ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఆమెకు మిస్టిదోయ్ (Mishti Doi) తినాలనే బలమైన కోరిక పుట్టిందట. మిస్టిదోయ్ అనేది బెంగాలీ స్టైల్‌లో చేసే ప్రసిద్ధ స్వీట్. ఆ కోరిక అంత తీవ్రంగా ఉండటంతో, "ఈ టైమ్‌లో దొరుకుతుందా లేదా చూద్దాం" అని బయటికి వెళ్లిందట. అలా వెళ్లిన సమయంలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్వీట్ షాప్ ఆమె కంటపడింది. వెంటనే ఆనందంతో అక్కడికి వెళ్లితే.. అప్పటికే షాప్ అకౌంట్స్ క్లోజ్ చేసి, తాళాలు వేస్తున్న పరిస్థితి. అయినా స్వీట్ తినాలనే కోరిక తగ్గలేదని రెజీనా చెప్పింది.
'కళ్లముందే నాకు ఇష్టమైన స్వీట్ కనిపిస్తోంది. తినకుండా ఎలా ఉండగలను?'అనే ఆలోచనతో షాప్ కీపర్‌ను ఏదైనా అడగాలనిపించిందట. అప్పుడు ఆమె చేసిన పని ఏమిటంటే... తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం. "ప్రెగ్నెంట్ కాబట్టి చాలా క్రేవింగ్‌గా ఉంది, దయచేసి కొంచెం స్వీట్ ఇవ్వండి" అని షాప్ కీపర్‌ను బ్రతిమిలాడిందట. ఆ మాటలు విన్న షాప్ కీపర్ వెంటనే జాలిపడి, తాళాలు తీసి మిస్టిదోయ్ ఇచ్చేశాడట. ఆ స్వీట్ తిన్న తర్వాతే తన మనసు కుదుటపడిందని రెజీనా నవ్వుతూ చెప్పింది.
'అప్పట్లో ఎవరైనా నన్ను గుర్తుపట్టివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో' అంటూ ఆమె చేసిన కామెంట్స్‌కు స్టూడియో మొత్తం నవ్వుల పూలు పూచింది ఈ ఫన్నీ సంఘటనను రెజీనా చాలా స్పోర్టివ్‌గా చెప్పడంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











